ముఖ్యాంశాలు:
బీటీఎస్ 202 అనేది నవంబర్ 17–19 తేదీలలో బెంగళూరులోని బీఐఈసీలో ‘ఏఐ & బియాండ్’ అనే థీమ్‌తో నిర్వహించబడుతుంది_
ఈ కార్యక్రమంలో 75కు పైగా దేశాల నుండి 1800కు పైగా ఎగ్జిబిటర్లు, 20,000కు పైగా ప్రతినిధులు, 60,000కు పైగా సందర్శకులు పాల్గొననున్నారు. కర్ణాటక ప్రభుత్వం హైదరాబాద్‌లో పరిశ్రమల నాయకులు, టెక్ దిగ్గజాలు, ఇన్వెస్టర్లు, వ్యవస్థాపకు లతో ఒక ఇండస్ట్రీ ఇంటరాక్షన్ మీట్‌ను నిర్వహిస్తోంది
ఈ ఇండస్ట్రీ ఇంటరాక్షన్ మీట్, టెక్నాలజీ కంపెనీలు, స్టార్టప్‌లకు బీటీఎస్ 2026 లోని అవకాశాలను అన్వేషించడానికి, సదస్సును నడిపిస్తున్న కీలక భాగస్వాములతో సంభాషించడానికి ఒక అవకా శాన్ని అందిస్తుంది.
హైదరాబాద్, 11 సెప్టెంబర్, 2026: ఆసియాలోనే అతిపెద్ద టెక్నాలజీ షో అయిన బెంగళూరు టెక్ సమ్మిట్ 29వ ఎడిషన్ కోసం నిర్వహిస్తున్న రోడ్ షోలో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన ఇండస్ట్రీ ఇంటరాక్షన్ మీట్లో కర్ణాటక శాసనసభ సభ్యులు, కియోనిక్స్ (KEONICS) ఛైర్మన్ అయిన శ్రీ శరత్ కుమార్ బాచే గౌడ ప్రసంగిం చారు. 2026 నవంబర్ 17–19 తేదీలలో బెంగళూరు అంతర్జాతీయ ఎగ్జిబిషన్ సెంటర్ (BIEC)లో ఈ సదస్సు ‘ఏఐ & బియాండ్’ అనే థీమ్‌తో నిర్వహించబడుతుంది.
దాదాపు మూడు దశాబ్దాల అద్భుత ప్రస్థానం ఆధారంగా, బెంగళూరు టెక్ సమ్మిట్ 2026 (BTS 2026) మరో సారి భారతదేశ టెక్నాలజీ, ఆవిష్కరణలకు ఒక ప్రధాన వేదికగా నిలవనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్‌టెక్, ఎలక్ట్రానిక్స్ & సెమీకండక్టర్స్, బయోటెక్నాలజీ, స్టార్టప్‌లు, ఏవీజీసీ, ఇతర అత్యాధునిక టెక్నాలజీ రంగాలలో సహకారాన్ని పెంపొందించడానికి, కొత్త అవకాశాలను ఆవిష్కరించడానికి ఇది ప్రపంచ నాయకు లను, పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను, పరిశోధకులను, విధాన రూపకర్తలను ఒకచోట చేర్చు తుంది.
75కు పైగా దేశాలు, భారతదేశంలోని 30కు పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి 1,800కు పైగా ఎగ్జిబి టర్లు, 25,000కు పైగా ప్రతినిధులు, 1,000కు పైగా టెక్ స్టార్టప్‌లు, 60,000కు పైగా వ్యాపార సందర్శకులను BTS 2026 ఒకచోట చేర్చుతుందని అంచనా వేయబడింది. తద్వారా ఇది టెక్నాలజీ, ఆవిష్కరణ, భాగస్వా మ్యం కోసం అత్యంత ప్రభావవంతమైన గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటిగా నిలువనుంది. ఈ మూడు రోజుల సదస్సులో ఏఐ & డీప్‌టెక్, ఫిన్‌టెక్, హెల్త్ & బయోటెక్, స్పేస్‌టెక్, ఇండియా-యూఎస్ఏ టెక్ కాంక్లేవ్, గ్లోబల్ కొలాబరేషన్ వంటి బహుళ థీమాటిక్ ట్రాక్‌లతో కూడిన డైనమిక్ కాన్ఫరెన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. వీటితో పాటు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ & డేటా సెంటర్స్, సర్క్యులర్ ఎకానమీ, ఆరెంజ్ ఎకానమీ, ఎలక్ట్రిక్ మొబిలిటీ వంటి అభివృద్ధి చెందుతున్న ప్రాధాన్య రంగాలు కూడా ఉంటాయి. ఈ సదస్సులో, వివిధ రంగాలలోని అద్భుతమైన ఆవిష్కరణలను ప్రదర్శించే ఒక భారీ బహుళ-పెవిలియన్ ప్రదర్శనతో పాటు, ప్రత్యేకంగా రూపొందించిన నెట్వర్కింగ్ వేదికలు, ఇన్వెస్టర్లతో అనుసంధాన కార్యక్రమాలు, ప్రపంచ భాగస్వామ్యాలు ఉంటాయి. అధిక సామర్థ్యం గల స్టార్టప్‌లను వెలుగులోకి తీసుకురావడానికి, వారి ని ఇన్వెస్టర్లు, మార్గదర్శకులు, ప్రపంచ మార్కెట్లతో అనుసంధానించడానికి రూపొందించిన ‘ఫ్యూచర్ మేకర్స్’ కార్యక్రమం దీనిలోని ఒక ముఖ్యమైన ఆకర్షణ. ఈ కార్యక్రమంలో ఇన్వెస్టర్లతో పిచింగ్ సెషన్లు, ఒకరితో ఒక రు మెంటారింగ్ క్లినిక్‌లు, వ్యాపారాన్ని విస్తరించడం, నిధుల సమీకరణపై నేపథ్య చర్చలు, స్టార్టప్ షోకేస్, ఫ్యూచర్ మేకర్స్ కాంక్లేవ్ వంటివి ఉంటాయి. ఇవి వ్యవస్థాపకులు, ఇన్వెస్టర్లు, ఆవిష్కర్తలు, మార్పు సృష్టికర్త లతో కూడిన విభిన్న వర్గాన్ని ఒకచోట చేర్చుతాయి.
వేదికపై హాజరయ్యే ప్రముఖులలో వీరు ఉన్నారు: డా. ఎన్. మంజుల, ఐఏఎస్, చైర్పర్సన్, బీడబ్ల్యూఎస్ ఎస్బీ, కర్ణాటక ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఐటీ, బీటీ, ఎస్&టీ శాఖ కార్యదర్శి; శ్రీమతి కవిత సి, డైరెక్టర్, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ), హైదరాబాద్; డా. అవినాష్ మేనన్ రాజేంద్రన్, ఐఏఎస్, డైరెక్టర్, కర్ణాటక ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఐటి & బిటి విభాగం మరియు కిట్స్ మేనేజింగ్ డైరెక్టర్; జితేంద్ర చద్దా, కర్ణాటక ప్రభుత్వ ఐటి విజన్ గ్రూప్ సభ్యులు, బెంగళూరు టెక్ సమ్మిట్, ఈఎస్డిఎం కాన్ఫరెన్స్ కమిటీ ఛైర్మన్; డా. బి. వి. ఆర్. మోహన్ రెడ్డి, సైయంట్ లిమిటెడ్ వ్యవస్థాపక ఛైర్మన్, నాస్కామ్ మాజీ ఛైర్పర్సన్; జగదీష్ పటాంకర్, బెంగళూరు టెక్ సమ్మిట్ 2026 ఈవెంట్ క్యూరేటర్, ఎంఎం యాక్టివ్ సై-టెక్ కమ్యూనికే షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్.
ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, ఎంబెడెడ్ సిస్టమ్స్‌పై దృష్టి సారించే, ప్రపంచ స్థాయి ఈవెంట్ అయిన ‘ఎంబెడెడ్ వరల్డ్ ఇండియా’ను నూరెంబర్గ్మెస్సే ఇండియా తొలిసారిగా భారతదేశంలో కూడా నిర్వహిస్తుండటం బీటీఎస్ 2026 యొక్క ఒక ముఖ్య విశేషం. విస్తరించిన ఎగ్జిబిషన్, ప్రపంచ దేశాల ప్రతినిధి బృందాలు, స్టార్టప్ కార్యక్రమాలు, ఇన్వెస్టర్లతో సమావేశాలు, కాన్ఫరెన్స్ ట్రాక్‌లు, విజ్ఞానాన్ని పంచుకునే వేదికలతో, గత ఎడిషన్ల స్ఫూర్తిని బీటీఎస్ 2026 మరింత ముం దుకు తీసుకువెళ్తుందని భావిస్తున్నారు.
తద్వారా దేశంలోనే అగ్రగామి టెక్నాలజీ, ఆవిష్కరణల కేంద్రంగా కర్ణాటక స్థానాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుంది. ఈ నవంబర్‌లో బెంగళూరు మరోసారి ప్రపంచ సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతున్న తరుణంలో, బెంగళూరు టెక్ సమ్మిట్ 2026 టెక్నాలజీ రంగంలోని మేధావులను ఒకచోట చేర్చి ఏఐకి అతీతంగా ఉన్న అంశాలను అన్వేషించడానికి, ఆవిష్కరణలను, ప్రపంచ భాగస్వామ్యాలను, టెక్నాలజీ భవిష్యత్తును తీర్చి దిద్దే పరివర్తనాత్మక ఆలోచనలను ముందుకు నడిపించడానికి దోహదపడుతుందని వాగ్దానం చేస్తోంది.
