Mon, 26 Oct 2026
🔴 BREAKING
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు గౌరవం, గర్వకారణమైన ఆత్మీయ సత్కారం యూసఫ్ గూడలో ఘనంగా బతుకమ్మ వేడుకలు అహలే సున్నత్వల్ జామాత్ (ASJ) ఆధ్వర్యంలో ఘనంగా గ్యార్వీ వేడుకలు సంగారెడ్డిలో జగ్గారెడ్డి, నిర్మల ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు రూ. 16 లక్షల గంజాయి పట్టివేత
తెలంగాణ

ఎన్‌డీపీఎల్, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపండి.

క్యూర్ ఎక్సైజ్ అధికారుల సమావేశంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి.హరికిరణ్ అదేశాలు.

కొత్తగా ఏర్పడిన క్యూర్ పరిధిలోని ఎక్సైజ్ అధికారులు, యంత్రాంగం ఎన్‌డీపీఎల్, ఎన్‌డీపీఎస్ ఉక్కుపాదం మోపాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి.హరికిరణ్ అదేశించారు.ఆబ్కారీ భవన్‌లో సోమవారం క్యూర్ పరిధిలోని డిప్యూటి కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, ఈఎస్‌లతో కమిషనర్ సమావేశాన్ని నిర్వహించారు.

క్యూర్ ఏర్పడిన మూడు నెలల్లో జరిగిన క్రైమ్‌పై కమిషనర్ సమీక్ష నిర్వహించారు.

క్రైమ్‌ను కంట్రోల్ తోపాటు బార్లు, మద్యం దుకాణాలకు సంబంధించిన ఎక్సైజ్ ఫీజ్ ఇన్‌స్టామెంట్స్ పై కూడ దృష్టి సారించాలని కమిషనర్ అధికారులను అదేశించారు.

ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ సయ్యద్ యాషిన్ ఖురేషి, జాయింట్ కమిషనర్ అంజన్‌రావు, హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి డిప్యూటి కమిషనర్లు ఏ.శ్రీనివాసరెడ్డి, జె. హరికిషన్, పి. ప్రణవిలతోపాటు అసిస్టెంట్ కమిషనర్లు శీలం శ్రీనివాస్, డి.శ్రీనివాస్,జి.శ్రీనివాసరెడ్డి, ప్రదీప్‌రావులులతోపాటు ఈఎస్‌లు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *