Mon, 26 Oct 2026
🔴 BREAKING
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు గౌరవం, గర్వకారణమైన ఆత్మీయ సత్కారం యూసఫ్ గూడలో ఘనంగా బతుకమ్మ వేడుకలు అహలే సున్నత్వల్ జామాత్ (ASJ) ఆధ్వర్యంలో ఘనంగా గ్యార్వీ వేడుకలు సంగారెడ్డిలో జగ్గారెడ్డి, నిర్మల ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు రూ. 16 లక్షల గంజాయి పట్టివేత
తెలంగాణ

రెజ్లింగ్ రాష్ట్ర జట్టు శిక్షణలో ప్రతిభ కనబరిచి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో పతకం సాధించాలి : ఎమ్మెల్యే రాందాస్ నాయక్

ఈనెల 17, 18 తేదీలు హైదరాబాద్, గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో కేలో ఇండియా యూత్ గేమ్స్ రెజ్లింగ్ రాష్ట్ర జట్టు శిక్షణ శిబిరానికి ఎంపిక చేసేందుకు నిర్వహించిన పోటీలలో 57 కేజీల విభాగంలో సత్తా చాటి ఎంపికైన జూలూరుపాడు మండలానికి చెందిన రెజ్లింగ్ క్రీడాకారిణి, జి. హారికను వైరా శాసనసభ్యులు శ్రీ రామదాసు నాయక్ ఈరోజు ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామదాసు నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర జట్టు శిక్షణలో కూడా ప్రతిభ కనబరిచి ఖేలోఇండియా యూత్ గేమ్స్ పోటీలలో పాల్గొని ప్రతిభ కనబరిచి పతకం గెలుపొంది జిల్లా ఖ్యాతిని చాటాలని అందుకు క్రీడాకారీని హారిక కు కావలసిన అన్ని సదుపాయాలు కల్పించి పతకాలు సాధించేందుకు తగిన ప్రోత్సాహాన్ని అందిస్తానని శాసనసభ్యులు, శ్రీ రామదాసు నాయక్ తెలిపారు. జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.కాశీ హుస్సేన్ వద్దశిక్షణ పొందుతున్న హారిక
గతంలో కూడా పలు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో ప్రతిభ చాటి అనేక పతకాలు బహుమతులు గెలుపొందారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, శ్రీ పి.కాశీ హుస్సేన్, ఉపాధ్యక్షులు గుగులోతు కృష్ణ, అసోసియేషన్ సభ్యులు జి.వెంకట్, కోచ్ లు సీనియర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *