గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి.
సంగారెడ్డి డీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ పర్స శ్యామ్ రావు.
మహాత్మా గాంధీజీ చూపిన అహింస, సత్యం, శాంతి మార్గాలు నేటి సమాజానికి ఎంతో అవసరమని సంగారెడ్డి జిల్లా డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్స శ్యామ్ రావు అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా తెల్లాపూర్ డివిజన్ ఉస్మాన్ నగర్ వార్డు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
స్వాతంత్ర్య సమరంలో మహాత్మా గాంధీజీ చేసిన సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయమని అన్నారు. సత్యం, అహింస అనే ఆయుధాలతో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో గాంధీజీ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాండ్ల శ్రీనివాస్, వార్డు సభ్యులు కావాలి రాములు, తలారి విష్ణు, అంతగిరిపల్లి శ్రీనివాస్, రాజు, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
