Fri, 02 Oct 2026
🔴 BREAKING
జింఖానా గ్రౌండ్స్ లో కుకి స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ‘చవాంగ్ గోల్ సే 2026’ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే  శ్రీగణేష్  అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ, పీ.జీ ప్రవేశ గడువు పోడుగింపు రిజిస్ట్రేషన్, ట్యూషన్ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ 13 అక్టోబర్ 2026 అక్టోబర్ 7, 2026న డా. బి. ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27 వ స్నాతకోత్సవం ది ప్లాజా హోటల్, బేగంపేట లో తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభం
Uncategorized

అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ, పీ.జీ ప్రవేశ గడువు పోడుగింపు రిజిస్ట్రేషన్, ట్యూషన్ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ 13 అక్టోబర్ 2026

హైదరాబాద్, సెప్టెంబర్ 30, 2026: డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ) కోర్సులు, పీ.జీ (ఎం.ఏ/ ఎం.కాం/ ఎం.ఎస్సీ, ఎం.బీ.ఏ) కోర్సులు, B.Lisc, M.Lisc, డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను చివరి తేది అక్టోబర్ 13, 2026 వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయంలో 2024-25, 2025-26 విద్యా సంవత్సరాల్లో డిగ్రీ లో చేరిన ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు లేదా అంతకు ముందు చేరిన డిగ్రీ / పీ.జీ విద్యార్థులు సకాలంలో ఫీజు చెల్లించలేక పోయిన వారు కూడా అక్టోబర్ 13వ తేదీ లోపు ట్యూషన్ ఫీజును ఆన్ లైన్ లో లేదా నెట్ బ్యాంకింగ్ / క్రెడిట్ / డెబిట్ కార్డ్ లేదా ఆన్‌లైన్ సెంటర్ల ద్వారా చెల్లించాలని సూచించారు.
పూర్తి సమాచారం, ఆన్ లైన్ లో నమోదు తదితర అంశాలపై సందేహాలుంటే సమీపంలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని లేదా విశ్వవిద్యాలయ హెల్ప్ డెస్క్ నంబర్లు: 040-23680 222 / 333 / 444 / 555, టోల్‌ఫ్రీ నెం. 18005990101 లో లేదా www.braouonline.in, www.braou.ac.in లో పొందొచ్చన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *