Sun, 22 Nov 2026
🔴 BREAKING
ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రారంభోత్సవం రోజునే రూ.800 కోట్ల అమ్మకాలు సాధించిన ఏఎస్‌బీఎల్‌ లెగసీ నవనిర్మాణ్ ఫౌండేషన్ మరియు ట్రూ కనెక్ట్ ఈవెంట్స్ అండ్ ఎక్స్‌పోస్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్ సమీపంలోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న FAABXPO 2026 – ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ ఎక్స్‌పో GeM పోర్టల్ ద్వారా అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకున్న ట్రైబల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ( టిక్కి) నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఎపిక్ ఇంటర్నేషనల్ హాస్పిటల్‌ను ప్రారంభించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే విశిష్ట సామాజిక సేవకు గాను డాక్టర్ విజయరాజ్ గడ్డం గారికి ప్రతిష్టాత్మక “సేవా రత్న” పురస్కారం
Uncategorized

ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రారంభోత్సవం రోజునే రూ.800 కోట్ల అమ్మకాలు సాధించిన ఏఎస్‌బీఎల్‌ లెగసీ

ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌ ప్రాంతంలోనే అత్యంత ఎత్తైన నివాస సముదాయంగా నిలవడంతో పాటుగా తొలి పూర్తి గేటెడ్‌ కమ్యూనిటీగా ఏఎస్‌బీఎల్‌ లెగసీ రికార్డు సృష్టించింది. హ్యాండోవర్ వరకు జీరో ఈఎంఐ ఆఫర్‌ తో ప్రారంభించబడుతుంది.

హైదరాబాద్‌, నవంబర్‌ 21, 2026: సెంట్రల్‌ హైదరాబాద్‌లో ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌ వద్ద ఏఎస్‌బీఎల్‌ సంస్థ చేపట్టిన తొలి నివాస ప్రాజెక్టు ‘ఏఎస్‌బీఎల్‌ లెగసీ’ ప్రారంభోత్సవ రోజే రూ.800 కోట్ల విలువైన అమ్మకాలను నమోదు చేసింది. ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు, ఆ ప్రాంతంలోనే అత్యంత ఎత్తైన నివాస సముదాయంగా, తొలి పూర్తి గేటెడ్‌ కమ్యూనిటీగా నిలవనుంది. హైదరాబాద్‌లోని అత్యంత సుస్థిరమైన నివాస ప్రాంతాల్లో ఒకటైన ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌లోకి కంపెనీ ప్రవేశించడానికి ఈ ప్రాజెక్టు నాంది పలికింది.
ప్రాజెక్టు ప్రారంభంతో పాటు ఏఎస్‌బీఎల్‌ ‘హ్యాండోవర్ వరకు జీరో ఈఎంఐ’ ఆఫర్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్‌ కింద గృహ కొనుగోలుదారులు ఇంటిని బుక్‌ చేసుకుని, ఇంటిని అప్పగించే వరకు ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండదు. సాధారణంగా నిర్మాణ సమయంలో వినియోగదారులు చెల్లించాల్సిన వడ్డీ మొత్తాన్ని ఆ కాలమంతా కంపెనీనే భరిస్తుంది.
సాధారణంగా ఒక కొనుగోలుదారు నిర్మాణంలో ఉన్న ఇంటిని గృహ రుణం ద్వారా కొనుగోలు చేసినప్పుడు, నిర్మాణ పనులు ముందుకు సాగుతున్న కొద్దీ బ్యాంకు విడతల వారీగా రుణాన్ని విడుదల చేస్తుంది. ఇలా విడుదలైన రుణ మొత్తంపై కొనుగోలుదారుడు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. నిర్మాణం పురోగమిస్తున్న కొద్దీ ఈ చెల్లింపులు పెరుగుతూ, చివరకు పూర్తి ఈఎంఐలుగా మారతాయి. ఇప్పటికే అద్దె చెల్లిస్తున్న లేదా మరో ఇంటి రుణాన్ని నిర్వహిస్తున్న కుటుంబాలకు, కొత్త ఇంట్లోకి మారడానికి ముందే, కొన్నిసార్లు రెండు ఇళ్లకు సంబంధించిన ఆర్థిక బాధ్యతలను ఒకేసారి భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
మార్కెట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న చాలా ప్రీ-ఈఎంఐ ఆఫర్లు నిర్మాణంలో ఒక నిర్దిష్ట దశ వరకు మాత్రమే, సాధారణంగా తొలి స్లాబ్‌ పూర్తయ్యే వరకు మాత్రమే ఊరటనిస్తాయి. అయితే, ఏఎస్‌బీఎల్‌ ఆఫర్‌ నిర్మాణ కాలం మొత్తం ఈ ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ పథకం కింద కొనుగోలుదారులు బుకింగ్‌ మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుంది. ఇంటిని అప్పగిస్తున్నట్లు అధికారికంగా సమాచారం ఇచ్చే వరకు వడ్డీ భారాన్ని ఏఎస్‌బీఎల్‌ భరిస్తుంది. మిగిలిన ఇంటి ధరను అప్పగించే సమయంలో చెల్లించాల్సి ఉంటుంది. నిర్మాణంలో ఉన్న కొత్త ఇంటి కోసం వేచి చూసే సమయంలో కొనుగోలుదారులపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించడమే ఈ ఆఫర్‌ లక్ష్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *