జూబ్లీహిల్స్ నియోజకవర్గం, టీవీ5 న్యూస్ కార్యాలయం సమీపంలోని మెయిన్ రోడ్ నంబర్–9లో డాక్టర్ బాలాజీ పటేల్ కోలా గారు నూతనంగా ఏర్పాటు చేసిన ఎపిక్ ఇంటర్నేషనల్ హాస్పిటల్‌ను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ఆసుపత్రిని సందర్శించి, అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించడంలో ఈ ఆసుపత్రి మరింత గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ బాలాజీ పటేల్ కోలా గారు, ఆసుపత్రి సిబ్బంది, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
