హైదరాబాద్‌లోని కుకి స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (KSO) ఆధ్వర్యంలో సికింద్రాబాద్ జింఖానా మైదానంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల ‘చవాంగ్ గోల్ సే 2026’ స్పోర్ట్స్ మీట్‌కు ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్య అతిథిగా హాజరై, కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. మణిపూర్ లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలతో తీవ్ర ఆవేదనకు గురైన కుకి సమాజానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని శ్రీగణేష్ స్పష్టం చేశారు. క్రీడలు మానసిక ఉపశమనాన్ని, ఓదార్పును ఇవ్వడమే కాకుండా, కొత్త ఆశలను చిగురింపజేస్తాయని పేర్కొన్నారు. బాధల్లో ఉన్న సమాజానికి ఇలాంటి క్రీడోత్సవాలు ఎంతో ఊరటనిస్తాయని, క్రీడల ద్వారా ఐక్యత, సోదరభావం పెరుగుతాయని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా క్రీడలు అంటే చాలా ఇష్టం అని ఆయన క్రీడలను ప్రోత్సహించడానికి ఎప్పుడూ ముందుంటారని తెలిపారు. హైదరాబాద్ నగరం ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరినీ ఆదరించే విశ్వనగరమని గుర్తుచేసిన ఆయన, హైదరాబాద్ ను మీ రెండవ ఇల్లుగా భావించండి.. ఇక్కడ ఉన్న కుకి వర్గానికి ఎలాంటి సమస్య వచ్చినా, మీ సోదరుడిగా నేను ఎల్లప్పుడూ అండగా ఉంటాను అని హామీ ఇచ్చారు. ఈ స్పోర్ట్స్ మీట్ పాల్గొంటున్న క్రీడాకారులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుకి స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (KSO) ప్రతినిధులు, కుకి కమ్యూనిటీ పెద్దలు, విద్యార్థులు, కుకి యువత మరియు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
