Mon, 26 Oct 2026
🔴 BREAKING
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు గౌరవం, గర్వకారణమైన ఆత్మీయ సత్కారం యూసఫ్ గూడలో ఘనంగా బతుకమ్మ వేడుకలు అహలే సున్నత్వల్ జామాత్ (ASJ) ఆధ్వర్యంలో ఘనంగా గ్యార్వీ వేడుకలు సంగారెడ్డిలో జగ్గారెడ్డి, నిర్మల ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు రూ. 16 లక్షల గంజాయి పట్టివేత
తెలంగాణ

ఉస్మాన్ నగర్‌లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి.

సంగారెడ్డి డీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ పర్స శ్యామ్ రావు.

మహాత్మా గాంధీజీ చూపిన అహింస, సత్యం, శాంతి మార్గాలు నేటి సమాజానికి ఎంతో అవసరమని సంగారెడ్డి జిల్లా డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్స శ్యామ్ రావు అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా తెల్లాపూర్ డివిజన్ ఉస్మాన్ నగర్ వార్డు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.స్వాతంత్ర్య సమరంలో మహాత్మా గాంధీజీ చేసిన సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయమని అన్నారు. సత్యం, అహింస అనే ఆయుధాలతో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో గాంధీజీ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాండ్ల శ్రీనివాస్, వార్డు సభ్యులు కావాలి రాములు, తలారి విష్ణు, అంతగిరిపల్లి శ్రీనివాస్, రాజు, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *