సికింద్రాబాద్ కంటోన్మెంట్, అక్టోబర్ 28: తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి గౌరవ శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీగణేష్ గారు బుధవారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ గారు మాట్లాడుతూ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో కలకాలం జీవించాలని ఆకాంక్షించారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేలా కృషి చేస్తూ, రాష్ట్ర అభివృద్ధిలో మరింత కీలక పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారు. భగవంతుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు, మనశ్శాంతి, మరింత శక్తిసామర్థ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీగణేష్ గారు తెలిపారు
