అరుంధతీయ బంధు సేవా మండలి గత 44 సంవత్సరాలుగా ఆహర్నిశలు ఎన్నో కష్టాలకు ఓర్చి అరుంధతీయుల ఆధ్యవతికి పాటుపడుతున్న ఒక సామాజిక సేవా సంస్థ బంధువులందరి సహాయ సహకారాలతో దిన దిన ప్రవర్ధమానమై ఒక పటవృక్షమై నిలిచింది. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ 1967లో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని లేవనెత్తడం జరిగింది. తదనంతరం 1994లో లక్షలాది మందితో నిజాం కాలేజి గ్రౌండ్స్‌లో వర్గీకరణ అంశాన్ని బాహాటంగా ప్రభుత్వం దృష్టికి తేవడం జరిగింది. అంతే కాకుండా ఆరుంధతీయ బంధు సేవా మండలి యెక్క వర్గీకరణ ఆకాంక్షను గౌరవనీయులు పద్మశ్రీ శ్రీ మంద క్రిష్ణ మాదిగ గారి నాయకత్వం ద్వారా నెరవేరిందని వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమం 25-10-2026 (ఆదివారం) ఉ॥ 10 గం॥ల నుండి సా॥ గం|| 7.00 వరకు
మున్నూరుకాపు సంఘం, మ్యాడం అంజయ్య హాలు, కాచిగూడ స్టేషన్ రోడ్, హైదరాబాద్ లో జరిగింది. ముఖ్య అతిథి: “బంధురత్న” గౌ|| శ్రీ సి. దామోదర రాజనర్సింహ్మ గారు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రివర్యులు హాజరయ్యారు. మరో ముఖ్య అతిథి శ్రీ సర్వే సత్యనారాయణ, మాజీ ఎం.పి హాజరై మాట్లాడుతూ రాష్ట్ర కేబినెట్ లో మాదిగలకు ఎప్పుడూ అన్యాయమే జరుగుతోందని, పార్టీ కేడర్ లో ఎంత సీనియర్స్ ఉన్నప్పటికీ
మాదిగలకు ఒక్క పదవి కూడా లేదని వాపోయారు. పార్టీ కొరకు ఎంత కష్టపడినా లాభం లేక పోయిందని అన్నారు. మాదిగలు అందరూ సంఘటితంగా ఉండాలని అన్నారు.
“దళిత రత్న” డి.యం. బాలసుందర్ రావు గారు ABSM వ్యవస్థాపక సభ్యులు NFC Retd. గారికి “బంధురత్న” బిరుదు ప్రధానం చేశారు.
అన్నదాత సుఖీభవ : శ్రీ గ్రద్దల ఈశ్వర్, గ్రద్దల మాణిక్ MBBS, MD (PUL), డా॥ జి. పవన్ కుమార్ MBBS, డా॥ కుమారి ప్రవళిక వాహిది. ప్రశాంత్ కుమార్ IIT Dual Degree From IIT Roorkee గార్ల సౌజన్యంతో భోజన సదుపాయం కల్పించడం జరిగింది.
ఎస్పీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలుకై ఏర్పాటైన సబ్ కమిటీకి మండలి తరపున వినతి పత్రం సమర్పించి తగు సూచనలు చేయటం జరిగింది. ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లకు సంబంధించిన పోరాటంలో లక్ష్మిదేవి పేట దళితుల దమనకాండ పోరాటంలో అంబేడ్కర్ విగ్రహ దమన వ్యతిరేక పోరాటంలో, అనేక దళిత ఉద్యమాలలో బంధు సేవా మండలి పాల్గొంటూ మాదిగల సామాజిక విద్య, అభివృద్ధి, కుటుంబ సమస్యల పరిష్కారం, వివాహ పరిచయ వేదికలతో పాటు అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ, బంధు సేవా మండలి బంధువుల కొరకై నిరంతరం అరుంధతీయ వివాహ సంబంధముల కొరకు ప్రతిరోజు అనగా సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 6 గం॥ ల నుండి 8.30 గంటల వరకు వివాహ సంబంధాల రిజిస్ట్రేషన్ మరియు యువతీ, యువకుల ఫోటోలు చూపబడును. అరుంధతీయ వివాహ సంబంధముల విషయములో ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతి నెల చివరి ఆదివారం మధ్యాహ్నం 2 గం|| నుండి సా॥6 గం॥ల వరకు ప్రత్యేక కౌన్సిలింగ్ మరియు వివాహ పరిచయ వేదిక నిర్వహించబడును. వివాహ సంబంధం కొరకు నమోదు చేసుకునే వారు వారి పెళ్ళీడు అమ్మాయిల / అబ్బాయిల ఫోటోలు 6X4 (పాస్‌పోర్ట్ సైజు) తీసుకొని మండలి కార్యాలయము రూం నెం. 116, పంచవటీమాల్, నారాయణగూడ, హైదరాబాదు నందు అందజేయగలరని మరియు వివాహ సంబంధ సభ్యత్వ రుసుము రూ. 800/- మరియు రూపాయల 200/- మండలి సభ్యత్వ రుసుము చెల్లించగలరు.
అంతేకాకుండా ప్రతి సంవత్సరం మన మాదిగ బిడ్డలకు చదువులలో ప్రోత్సహించుట కొరకు దసరా మిలాప్ నాడు పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు సంపాదించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులు వెండి పతకములు, అందజేయడం జరుగుచున్నది. దీని కొరకై విద్యార్థులు తమ మార్కుల పట్టిక, కుల ధృవీకరణ పత్రమును జత చేసి ముండలి కార్యాలయమునకు పంపాల్సిందిగా కోరారు. మండలిలో సభ్యత్వం కోరువారు తమ వెంట పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు తీసుకొని మండలి కార్యాలయమునకు రాగలరు. సభ్యత్వం పొందడం వలన ఆరుంధతీయ బంధు సేవా మండలి యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచిన వారు అవుతారు.
అరుంధతీయ బంధు సేవా మండలి సరిక్రొత్త సూర్యోదయం కొరకు దిశ దశను మార్చాలని మండలి కార్యవర్గం యోచిస్తున్నది. ఈ మండలి తేది: 25-10-2026 (ఆదివారం) రోజు 44 సం.ల వార్షికోత్సవం “దసరా మిలాప్” వేడుకలను జరుపుకోవాలని కార్యవర్గం నిర్ణయం చేయడం సంతోషకరం అన్నారు.
ABSM సభ్యత్వం లో ప్రతి ఒక్కరు నెంబరు కావాలని పిలుపునిచ్చారు. రుసుము వివరములు: జీవితకాల సభ్యత్వం రూ.2000/-, వార్షిక సభ్యత్వము రూ.200/-, రెన్యువల్ రూ.200/-
ఈ కార్యక్రమం లో శ్రీ జి. ఈశ్వర్, రాష్ట్ర అధ్యక్షులు- ‘దళిత రత్న’ జి. సత్యేంద్ర కృష్ణ, రాష్ట్ర సెక్రెటరి జనరల్, ‘దళిత రత్న” బి. నర్సింగ్ రావు, అధ్యక్షులు, గ్రేటర్ హైదరాబాద్, ‘దళిత రత్న’ దానగల్ల పవన్ కుమార్, జనరల్ సెక్రెటరి, గ్రేటర్ హైదరాబాద్, మండలి సభ్యులు, అధికారులు, ఆఫీసు సిబ్బంది ఆంధ్రా మరియు తెలంగాణ నుండి పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
