Sun, 22 Nov 2026
🔴 BREAKING
ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రారంభోత్సవం రోజునే రూ.800 కోట్ల అమ్మకాలు సాధించిన ఏఎస్‌బీఎల్‌ లెగసీ నవనిర్మాణ్ ఫౌండేషన్ మరియు ట్రూ కనెక్ట్ ఈవెంట్స్ అండ్ ఎక్స్‌పోస్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్ సమీపంలోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న FAABXPO 2026 – ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ ఎక్స్‌పో GeM పోర్టల్ ద్వారా అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకున్న ట్రైబల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ( టిక్కి) నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఎపిక్ ఇంటర్నేషనల్ హాస్పిటల్‌ను ప్రారంభించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే విశిష్ట సామాజిక సేవకు గాను డాక్టర్ విజయరాజ్ గడ్డం గారికి ప్రతిష్టాత్మక “సేవా రత్న” పురస్కారం
Uncategorized

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆదిలాబాద్‌కు ఏం చేశారు? కేటీఆర్ సమాధానం చెప్పాలి

కవిత, కేటీఆర్ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఘాటు కౌంటర్ – కోర్టా-చనాకా ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణకు డిమాండ్

ఆదిలాబాద్:

రైతు గర్జన సభ పేరుతో ఆదిలాబాద్‌కు వస్తున్న కేటీఆర్, ముందుగా పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జిల్లాకు జరిగిన అన్యాయం, తరలిపోయిన ప్రాజెక్టులు, కోర్టా-చనాకా పనుల్లో నాణ్యత లోపాలు, రైతులకు జరిగిన అన్యాయంపై సమాధానం చెప్పాలని పాయల్ శంకర్ డిమాండ్ చేశారు.

పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాకు చేసిన అభివృద్ధి ఏమిటో ముందుగా ప్రజలకు సమాధానం చెప్పాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు.

నిన్న ఇంద్రవెల్లిలో అక్క, ఆదిలాబాద్‌లో అన్న సభలు పెట్టి మళ్లీ ఆదిలాబాద్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పదేళ్ల పాలనలో ఆదిలాబాద్‌కు రావాల్సిన గిరిజన యూనివర్సిటీని ములుగుకు తరలించుకుపోయారని, జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఎలాంటి చొరవ చూపలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన టెక్స్‌టైల్ పార్క్ సైతం ఆదిలాబాద్‌కు దక్కకుండా పోయిందని పేర్కొన్నారు.

ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి సంబంధించిన నిధులను సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల ప్రాంతాలకు మళ్లించిన సమయంలో అప్పటి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి జోగు రామన్న ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఆయన ఆదిలాబాద్ అభివృద్ధికి చేసిన పనులపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కోర్టా-చనాకా ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేకపోయారని పాయల్ శంకర్ ప్రశ్నించారు. కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేసినప్పటికీ కాలువలు నాసిరకం పనుల కారణంగా కూలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

నాణ్యత లేని పనులకు బాధ్యులెవరు? కాంట్రాక్టు ఒప్పందాలు ఎలా జరిగాయి? పనుల అంచనాలు, నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయా? అప్పటి పాలకుల పాత్ర ఎంత? అనే అంశాలపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు.

అప్పటి మంత్రి జోగు రామన్న హయాంలో ప్రాజెక్టు పనుల్లో జరిగిన ఆర్థిక లావాదేవీలు, అవకతవకలపై కూడా విచారణ జరిపి, ఎవరు ఎంత తిన్నారో ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రైతులకు ప్రధానమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అమలు చేయకుండా రైతులకు అన్యాయం చేశారని విమర్శించారు. పంట నష్టాలతో రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంలో రైతులకు భరోసా కల్పించకుండా, ఇప్పుడు రైతు గర్జన సభలు నిర్వహించడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. రైతుల పట్ల నిజమైన చిత్తశుద్ధి ఉంటే పదేళ్ల పాలనలో చేసిన పనులపై సమాధానం చెప్పాలని అన్నారు.ఆదిలాబాద్‌కు దక్కాల్సిన అభివృద్ధి ప్రాజెక్టులు ఏమయ్యాయి?

– రైల్వే ROB/RUB పనులు ఎందుకు ముందుకు సాగలేదు?
– ఆదిలాబాద్ పారిశ్రామిక పార్కు ఎందుకు రాలేదు?
– గిరిజన యూనివర్సిటీ ఎందుకు తరలిపోయింది?
– టెక్స్‌టైల్ పార్క్ ఆదిలాబాద్‌కు ఎందుకు దక్కలేదు?
– కోర్టా-చనాకా ప్రాజెక్టు పదేళ్లలో ఎందుకు పూర్తికాలేదు?
– రైతుల మార్కెట్ నిధుల విషయంలో అప్పటి ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు?

తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆదిలాబాద్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూ.128 కోట్లతో ROB/RUB ప్రాజెక్టును తీసుకువచ్చానని, ఇది 100 శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న ప్రాజెక్టు అని తెలిపారు. అలాగే ఆదిలాబాద్‌కు విమానాశ్రయం తీసుకురావడానికి కృషి చేసి, ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నామని స్పష్టం చేశారు.ఎమ్మెల్యే పాయల్ శంకర్‌పై కవిత చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ, ముఖ్యమంత్రిని కాపాడాల్సిన అవసరం తనకు లేదని, రాజకీయ ఆరోపణలు చేయడం కంటే ప్రజల సమస్యలపై మాట్లాడటం ముఖ్యమని అన్నారు. మీకు వ్యాపార భాగస్వామ్యాలు ఉండవచ్చేమో కానీ, నాకు మాత్రం ఆదిలాబాద్ అభివృద్ధే ఏకైక అజెండా అని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *