Sun, 22 Nov 2026
🔴 BREAKING
ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రారంభోత్సవం రోజునే రూ.800 కోట్ల అమ్మకాలు సాధించిన ఏఎస్‌బీఎల్‌ లెగసీ నవనిర్మాణ్ ఫౌండేషన్ మరియు ట్రూ కనెక్ట్ ఈవెంట్స్ అండ్ ఎక్స్‌పోస్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్ సమీపంలోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న FAABXPO 2026 – ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ ఎక్స్‌పో GeM పోర్టల్ ద్వారా అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకున్న ట్రైబల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ( టిక్కి) నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఎపిక్ ఇంటర్నేషనల్ హాస్పిటల్‌ను ప్రారంభించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే విశిష్ట సామాజిక సేవకు గాను డాక్టర్ విజయరాజ్ గడ్డం గారికి ప్రతిష్టాత్మక “సేవా రత్న” పురస్కారం
Uncategorized

రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు

కొత్తగూడెం, నవంబర్ 3: కొత్తగూడెం పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి, సామాజిక మరియు మతపరమైన సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే మహమ్మద్ మస్తాన్ (72) ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ, వాటిని ఇతరులకు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు మహమ్మద్ మస్తాన్ న్యాయవాదుల ద్వారా లీగల్ నోటీసు జారీ చేశారు.

తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు మహమ్మద్ ఫహీమ్ ఫిర్యాదు చేస్తూ, మహమ్మద్ మస్తాన్‌పై వక్ఫ్ ఆస్తులు, నిధుల దుర్వినియోగం, అవినీతికి సంబంధించిన ఆరోపణలు చేసినట్లు లీగల్ నోటీసులో పేర్కొన్నారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన వక్ఫ్ బోర్డు అధికారులు మహమ్మద్ మస్తాన్‌ను వివరణ కోరగా, ఆయన తన వివరణ సమర్పించడంతో పాటు ఆరోపణలకు సంబంధించిన నిర్దిష్ట ఆధారాలను అందించాలని కోరినట్లు నోటీసులో వివరించారు. అనంతరం ఆరోపణలకు సంబంధించి ఆధారాలు, డాక్యుమెంట్లు సమర్పించాలని ఫిర్యాదుదారుడికి ఏడు రోజుల గడువుతో అధికారులు నోటీసు ఇచ్చినప్పటికీ, తమకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సంబంధిత ఆధారాలు సమర్పించలేదని నోటీసులో పేర్కొన్నారు.

అయినప్పటికీ తనపై చేసిన ఆరోపణలను వివిధ వ్యక్తులకు ప్రచారం చేస్తూ, సామాజికంగా తన గౌరవ మర్యాదలకు, ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారని మహమ్మద్ మస్తాన్ ఆరోపించారు.

ఈ నేపథ్యంలో తన న్యాయవాదులు ఎం.డి.సాదిక్ పాషా, డి.సామంత్ కార్యలయం నుండి మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు జారీ చేయించారు.

ఈ నోటీసు ద్వారా తప్పుడు, నిరాధార ఆరోపణల ప్రచారాన్ని తక్షణమే నిలిపివేయాలని, ఏడు రోజుల్లో బహిరంగంగా బేషరతు క్షమాపణ చెప్పాలని, గతంలో చేసిన ఆరోపణలను ఉపసంహరించుకోవాలని, భవిష్యత్తులో ఇటువంటి ఆరోపణలు చేయకుండా ఉండాలని డిమాండ్ చేశారు.

అలాగే తనకు కలిగిన పరువు నష్టం, మానసిక వేదన, సామాజిక అవమానం, తదితర నష్టాలకు పరిహారంగా రూ.50,00,000/- (యాభై లక్షల రూపాయలు) చెల్లించాలని నోటీసులో కోరారు.

నిర్దేశించిన గడువులోగా నోటీసులో పేర్కొన్న డిమాండ్లను నెరవేర్చకపోతే, ఎలాంటి తదుపరి నోటీసు లేకుండా సంబంధిత న్యాయస్థానంలో సివిల్ మరియు క్రిమినల్ చట్టపరమైన చర్యలు చేపడతామని, భారతీయ న్యాయ సంహిత (BNS), 2023లోని సెక్షన్ 356 కింద అందుబాటులో ఉన్న చట్టపరమైన పరిహారాలను కూడా ఆశ్రయిస్తామని మస్తాన్ నోటిసులో పేర్కొన్నారు.

వ్యక్తుల ప్రతిష్ఠ, గౌరవ మర్యాదలకు భంగం కలిగించే విధంగా నిరాధార ఆరోపణలు చేయడం, వాటిని ధృవీకరించకుండా ప్రచారం చేయడం చట్టపరమైన పరిణామాలకు దారితీయవచ్చని ఈ సందర్భంగా న్యాయవాదులు యండి. సాదిక్ పాషా, డి. సామంత్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *