Sun, 22 Nov 2026
🔴 BREAKING
ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రారంభోత్సవం రోజునే రూ.800 కోట్ల అమ్మకాలు సాధించిన ఏఎస్‌బీఎల్‌ లెగసీ నవనిర్మాణ్ ఫౌండేషన్ మరియు ట్రూ కనెక్ట్ ఈవెంట్స్ అండ్ ఎక్స్‌పోస్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్ సమీపంలోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న FAABXPO 2026 – ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ ఎక్స్‌పో GeM పోర్టల్ ద్వారా అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకున్న ట్రైబల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ( టిక్కి) నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఎపిక్ ఇంటర్నేషనల్ హాస్పిటల్‌ను ప్రారంభించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే విశిష్ట సామాజిక సేవకు గాను డాక్టర్ విజయరాజ్ గడ్డం గారికి ప్రతిష్టాత్మక “సేవా రత్న” పురస్కారం
Uncategorized

ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: డాక్టర్ అండెకార్ శ్రీనివాస్

హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఘర్షణలు మానవాళికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని, ప్రపంచ శాంతి స్థాపనకు ప్రతి దేశం కృషి చేయాలని మోర్డ్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు, మిషన్ మోడీ జాతీయ కార్యదర్శి డాక్టర్ అండెకార్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

తెలంగాణ సారస్వత పరిషత్, హైదరాబాద్‌లో మోర్డ్ ఆర్గనైజేషన్, గ్లోబల్ సేవా ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచ శాంతి దినోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయిల్–పాలస్తీనా ఘర్షణల వల్ల అమాయక ప్రజలు, చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పక్క దేశంలో యుద్ధం జరుగుతుంటే మనకేమిటని నిర్లక్ష్యం చేయకూడదని, ప్రపంచ దేశాలు శాంతి స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందిస్తున్న ఎన్జీవోలకు ప్రపంచ శాంతి పురస్కారాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ డాక్టర్ రామచంద్ర నాయక్, జర్మన్ టెన్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ మీర్ జ్వాద్ జర్ ఖాన్, వంశీ టీవీ వంశీ కృష్ణ, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇఫ్తేఖార్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

యుద్ధాలు ఆగి ప్రపంచంలో శాంతి నెలకొన్నప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని వక్తలు ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *