24 సంవత్సరాల వ్యవసాయ అనుబంధ శాఖలో విధులు, అనుభవం మరియు రెండు విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, వ్యవసాయ కుటుంబం, గ్రామీణ నేపథ్యం అపార అనుభవం ఉన్నటువంటి నాకు గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవి కొరకు నన్ను నామినేట్ చేయమని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారిని, గౌరవ చీఫ్ సెక్రటరీ తెలంగాణ ప్రభుత్వం వారిని, మరియు లోక్ భవన్లో గవర్నర్ గారికి లేఖల ద్వారా కోరడం జరిగింది. ఎమ్మెల్సీ పదవులు సినిమా ఇండస్ట్రీ మరియు క్రికెట్ గేమ్స్ లాంటి వాటిలో కోట్లు సంపాదించినటువంటి వాళ్లకి అవకాశం ఇచ్చినందువల్ల ఎంతవరకు ప్రజలకు న్యాయం జరిగిందో నాకు తెలియదు కానీ, తప్పకుండా రాష్ట్ర అభివృద్ధి కొరకు నా వంతు కృషిచేసి నేను చేసే పదవికి తప్పక న్యాయం చేసి ఫలితం చూపిస్తానని అధికారులను మరియు ప్రభుత్వాన్ని కోరడమైనది.
గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవి కొరకు నన్ను నామినేట్ చేయండి : కల్లేపల్లి పరుశురాములు, ఎం. ఎస్సి.,
