Sun, 22 Nov 2026
🔴 BREAKING
ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రారంభోత్సవం రోజునే రూ.800 కోట్ల అమ్మకాలు సాధించిన ఏఎస్‌బీఎల్‌ లెగసీ నవనిర్మాణ్ ఫౌండేషన్ మరియు ట్రూ కనెక్ట్ ఈవెంట్స్ అండ్ ఎక్స్‌పోస్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్ సమీపంలోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న FAABXPO 2026 – ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ ఎక్స్‌పో GeM పోర్టల్ ద్వారా అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకున్న ట్రైబల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ( టిక్కి) నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఎపిక్ ఇంటర్నేషనల్ హాస్పిటల్‌ను ప్రారంభించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే విశిష్ట సామాజిక సేవకు గాను డాక్టర్ విజయరాజ్ గడ్డం గారికి ప్రతిష్టాత్మక “సేవా రత్న” పురస్కారం
Uncategorized

నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం

ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరామ్ గారు, బల్మూరి వెంకట్ గారు, సహచర ఎమ్మెల్యేలు మాజిద్ హుస్సేన్ గారు, నవీన్ యాదవ్ గార్లతో కలిసి పాల్గొన్న కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీగణేష్.

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దేశంలోనే చరిత్రాత్మకమైన పథకమని.. ఇది పథకం పేదకుటుంబాల పట్ల వరమని. ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు. రాష్ట్రంలోని కోటి మందికి పైగా కుటుంబాలను కష్ట కాలంలో ఆదుకుంటుందని అన్నారు. ఇప్పటి వరకూ పేదలకు అందుబాటులో లేని ఈ బీమా పథకం ఇప్పుడు తెలంగాణ లోని ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలోని రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఉచితంగా కల్పిస్తుందన్నారు.ఇప్పటికే ఫ్రీ బస్పు, ఉచిత విద్యుత్, సన్నబియ్యం ఇలా ఎన్నో పథకాలతో తెలంగాణ ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వం ఈ కుటుంబ బీమా పథకంతో మరో సారి తమది ప్రజా ప్రభుత్వమని రుజువు చేసుకుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *