హైదరాబాద్ | నవంబర్ 20, 2026 : టిక్కి సంస్థ ఆధ్వర్యంలో వ్యాపార, పారిశ్రామిక అభివృద్ధి మరియు ప్రభుత్వ కొనుగోళ్లలో అవకాశాలను విస్తరించే దిశగా ఒక ముఖ్యమైన ముందడుగు పడింది.
ఈ సందర్భంగా (టిక్కి ) వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ సుధాకర్ ధారావత్ గారు, జనరల్ సెక్రటరీ శ్రీ బసంత్ గారు కలిసి భారత ప్రభుత్వానికి చెందిన Government e-Marketplace (GeM) పోర్టల్ ద్వారా అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకున్నారు.
ఈ ఒప్పందం ద్వారా సంస్థకు సంబంధించిన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, సూక్ష్మ మరియు చిన్న తరహా వ్యాపార సంస్థలకు ప్రభుత్వ కొనుగోళ్ల వ్యవస్థపై అవగాహన కల్పించడం, GeM పోర్టల్ ద్వారా వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేలా ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రభుత్వ కొనుగోళ్లలో పారదర్శకత, నాణ్యత, పోటీ సామర్థ్యం మరియు వ్యాపార విస్తరణకు GeM ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తోందని తెలిపారు.
టిక్కి సంస్థ భవిష్యత్తులో మరింత మంది పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు మరియు యువ పారిశ్రామిక ఔత్సాహికులను అనుసంధానం చేస్తూ, వారికి కొత్త వ్యాపార అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తుందని వెల్లడించారు.
ఈ (ఎం ఓ యూ ) ద్వారా వ్యాపార అభివృద్ధికి, పారిశ్రామిక ప్రగతికి మరియు ప్రభుత్వ-ప్రైవేట్ వ్యాపార అనుసంధానానికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
