Wed, 18 Nov 2026
🔴 BREAKING
Dr. Vijayraj Gaddam Honoured with Prestigious “Seva Ratna” Award for Outstanding Social Service A career abroad, a commitment to the arts back home: Dr. V. Hema Vanasarla is shaping children into artists. Zeni Momaya Receives Prestigious ‘Manorama Kandar Nari Shakti Award–2026’ Nasha Mukt Yuva (Drug-Free Youth) State-Level Training Program on Drug Abuse Prevention.  Transforming Every School into a Drug-Free Educational Campus SEVEN HILLS BANK FOURTH BRANCH INAUGURATION Nominate me for the MLC position under the Governor’s quota: Kallepalli Parushuramulu, M.Sc.,
Uncategorized

ప్రకటన న్యూస్

కొత్తగూడెం, ప్రకటన న్యూస్ ప్రతినిధి, బి. అనిత : 16 జూలై, 2026 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల ఒకటవ తేదీ నుండి 31 వ తేదీ వరకు జరుగుతున్న ఆపరేషన్ ముస్కాన్ – 12 లో మొదటి పదిహేను రోజుల రెస్క్యు పూర్తి కావడం తో జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లేనినా మరియు ఇతర జిల్లా విభాగాల అధికారులతో అదనపు కలెక్టర్ లోకల్ బాడిస్ శ్రీమతి విద్యచందన కలేక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు.

గత పదిహేను రోజులు గా నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్ స్పెషల్ డ్రైవ్ లో ఎంత మంది బాల కార్మికులకు విముక్తి కలిగించారు. ఏన్ని కేసులు నమోదు అయ్యాయి. ఎంత మంది బాల బాలికలను రెస్క్యు చేయడం జరిగింది అనే అంశాలపై అధికారులతో పూర్తి సమాచారం తెలుసుకున్నారు.

ఛైల్డ్ మ్యారేజ్ కేసులు, ఛైల్డ్ లేబర్ కేసులు రిపోర్ట్ అయిన వెంటనే యఫ్ఐఆర్ నమోదు చేసి, భాదిత బాల బాలికలకు కౌన్సిలింగ్ ఇచ్చి పునరాసం కల్పించాలని అధికారును ఆదేశించారు. జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లేనినా ఆపరేషన్ ముస్కాన్ 12 రిపోర్ట్ కు సంబంధించిన పూర్తి రిపోర్ట్ ను కలేక్టర్ కు అందచేసి ఈ రోజు వరకు ఉన్న రిపోర్ట్ ఆధారం గా మరో పదిహేను రోజులు కుడా లైన్ డిపార్ట్‌మెంట్ లో అందరు పని చేసి రాష్ట్ర స్థాయి లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ను ఆపరేషన్ ముస్కాన్ స్పెషల్ డ్రైవ్ లో మంచి ఫలితాలు వచ్చే విధంగా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు లేనినా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు సబ్బాతి సుమిత్రా దేవి, మహమ్మద్ సాదిక్ పాషా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తూకారం రాథోడ్, జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, జిల్లా మైనార్టీ అధికారి అరుణ, లేబర్ ఆఫిసర్ నాగరాజు, డిపిఓ నవిన్, డిసిపివో హరి కుమారి, పోలీస్ శాఖ నుండి షీటీం యస్ఐ రమాదేవి, ఇతర జిల్లా విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *