తెలంగాణ ఎన్జీవో సంఘం హైదరాబాద్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు, TNGOs పాఠశాల విద్యాశాఖ హైదరాబాద్ సెంట్రల్ ఫోరం అధ్యక్షులు కె.ఆర్. రాజ్‌కుమార్, కార్యదర్శి ఎం.డి. ఫకృద్దీన్ అహ్మద్ ఆధ్వర్యంలో బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతరను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు.
ఈ సందర్భంగా డా. ఎస్.ఎం. హుస్సేని ముజీబ్ మాట్లాడుతూ, బోనాల పండుగ తెలంగాణ ప్రజల ఆత్మీయతకు, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. తరతరాలుగా కొనసాగుతున్న తెలంగాణ సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు వాటి విశిష్టతను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.

కార్యక్రమానికి పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయం అదనపు సంచాలకులు శ్రీ సత్యనారాయణ రెడ్డి, హైదరాబాద్ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు శ్రీ సోమిరెడ్డి, హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ యాదయ్య, అదనపు అధికారి శ్రీ శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల విద్యాశాఖ హైదరాబాద్ కార్యాలయ అదనపు అధికారి శ్రీ సత్యనారాయణ, రంగారెడ్డి జిల్లా అదనపు అధికారి శ్రీ పూర్ణచందర్, ప్రాంతీయ సంయుక్త సంచాలకుల అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఉన్నత న్యాయస్థాన ప్రభుత్వ న్యాయవాదులు, అదనపు ప్రభుత్వ న్యాయవాదులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
కార్యక్రమ నిర్వహణలో TNGOs పాఠశాల విద్యాశాఖ కేంద్ర ఫోరం అధ్యక్షులు కె.ఆర్. రాజ్‌కుమార్, కార్యదర్శి ఎం.డి. ఫకృద్దీన్ అహ్మద్, సీనియర్ నాయకులు ఎం.డి. ఉస్మాన్ పాషా, ఉపాధ్యక్షులు భాస్కర్, శ్రీ ఆర్. అశోక్, యుగేష్, రవి, జాయింట్ సెక్రటరీలు రమేష్, సుదర్శన్, జయంత్ రెడ్డి, ఠాకూర్, మొయిన్, పబ్లిసిటీ సెక్రటరీలు ఎం.వై. రవి, ఫెరోజ్ అహ్మద్, అరుణ జ్యోతి, ఆర్గనైజేషన్ సెక్రటరీలు కె. శ్రీనివాస్, శివ, ఎ. శేఖర్, కల్చరల్ సెక్రటరీ అఖిలుద్దీన్, ఈసీ మెంబర్లు యోగి, శివ తదితరులు సమన్వయం చేశారు.
పాఠశాల విద్యాశాఖ ఫోరం సభ్యులు, ఉద్యోగులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు, ఫోరం సభ్యులు, ఉద్యోగులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, భక్తులందరికీ నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
