Wed, 09 Sep 2026
🔴 BREAKING
మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్ 35 కుటుంబాలకు CMRF చెక్కుల పంపిణీ
Uncategorized

బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ

తెలంగాణ ఎన్జీవో సంఘం హైదరాబాద్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు, TNGOs పాఠశాల విద్యాశాఖ హైదరాబాద్ సెంట్రల్ ఫోరం అధ్యక్షులు కె.ఆర్. రాజ్‌కుమార్, కార్యదర్శి ఎం.డి. ఫకృద్దీన్ అహ్మద్ ఆధ్వర్యంలో బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతరను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు.

ఈ సందర్భంగా డా. ఎస్.ఎం. హుస్సేని ముజీబ్ మాట్లాడుతూ, బోనాల పండుగ తెలంగాణ ప్రజల ఆత్మీయతకు, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. తరతరాలుగా కొనసాగుతున్న తెలంగాణ సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు వాటి విశిష్టతను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.

ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ ఎన్జీవో సంఘం నిరంతరం కృషి చేస్తూనే, ఉద్యోగుల మధ్య ఐక్యతను పెంపొందించేలా సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని ముజీబ్ అన్నారు. ఉద్యోగులందరూ ఐక్యంగా ఉంటూ పరస్పర సహకారంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమానికి పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయం అదనపు సంచాలకులు శ్రీ సత్యనారాయణ రెడ్డి, హైదరాబాద్ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు శ్రీ సోమిరెడ్డి, హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ యాదయ్య, అదనపు అధికారి శ్రీ శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల విద్యాశాఖ హైదరాబాద్ కార్యాలయ అదనపు అధికారి శ్రీ సత్యనారాయణ, రంగారెడ్డి జిల్లా అదనపు అధికారి శ్రీ పూర్ణచందర్, ప్రాంతీయ సంయుక్త సంచాలకుల అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఉన్నత న్యాయస్థాన ప్రభుత్వ న్యాయవాదులు, అదనపు ప్రభుత్వ న్యాయవాదులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

కార్యక్రమ నిర్వహణలో TNGOs పాఠశాల విద్యాశాఖ కేంద్ర ఫోరం అధ్యక్షులు కె.ఆర్. రాజ్‌కుమార్, కార్యదర్శి ఎం.డి. ఫకృద్దీన్ అహ్మద్, సీనియర్ నాయకులు ఎం.డి. ఉస్మాన్ పాషా, ఉపాధ్యక్షులు భాస్కర్, శ్రీ ఆర్. అశోక్, యుగేష్, రవి, జాయింట్ సెక్రటరీలు రమేష్, సుదర్శన్, జయంత్ రెడ్డి, ఠాకూర్, మొయిన్, పబ్లిసిటీ సెక్రటరీలు ఎం.వై. రవి, ఫెరోజ్ అహ్మద్, అరుణ జ్యోతి, ఆర్గనైజేషన్ సెక్రటరీలు కె. శ్రీనివాస్, శివ, ఎ. శేఖర్, కల్చరల్ సెక్రటరీ అఖిలుద్దీన్, ఈసీ మెంబర్లు యోగి, శివ తదితరులు సమన్వయం చేశారు.

పాఠశాల విద్యాశాఖ ఫోరం సభ్యులు, ఉద్యోగులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

బంగారు మైసమ్మ తల్లి ఆశీస్సులతో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, తెలంగాణ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని డా. ముజీబ్ ఆకాంక్షించారు.

కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు, ఫోరం సభ్యులు, ఉద్యోగులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు, భక్తులందరికీ నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *