హైదరాబాద్, సెప్టెంబర్ 30, 2026: డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ) కోర్సులు, పీ.జీ (ఎం.ఏ/ ఎం.కాం/ ఎం.ఎస్సీ, ఎం.బీ.ఏ) కోర్సులు, B.Lisc, M.Lisc, డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను చివరి తేది అక్టోబర్ 13, 2026 వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయంలో 2024-25, 2025-26 విద్యా సంవత్సరాల్లో డిగ్రీ లో చేరిన ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు లేదా అంతకు ముందు చేరిన డిగ్రీ / పీ.జీ విద్యార్థులు సకాలంలో ఫీజు చెల్లించలేక పోయిన వారు కూడా అక్టోబర్ 13వ తేదీ లోపు ట్యూషన్ ఫీజును ఆన్ లైన్ లో లేదా నెట్ బ్యాంకింగ్ / క్రెడిట్ / డెబిట్ కార్డ్ లేదా ఆన్లైన్ సెంటర్ల ద్వారా చెల్లించాలని సూచించారు.
పూర్తి సమాచారం, ఆన్ లైన్ లో నమోదు తదితర అంశాలపై సందేహాలుంటే సమీపంలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని లేదా విశ్వవిద్యాలయ హెల్ప్ డెస్క్ నంబర్లు: 040-23680 222 / 333 / 444 / 555, టోల్‌ఫ్రీ నెం. 18005990101 లో లేదా www.braouonline.in, www.braou.ac.in లో పొందొచ్చన్నారు.
