క్యూర్ ఎక్సైజ్ అధికారుల సమావేశంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి.హరికిరణ్ అదేశాలు.
కొత్తగా ఏర్పడిన క్యూర్ పరిధిలోని ఎక్సైజ్ అధికారులు, యంత్రాంగం ఎన్డీపీఎల్, ఎన్డీపీఎస్ ఉక్కుపాదం మోపాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ సి.హరికిరణ్ అదేశించారు.
ఆబ్కారీ భవన్లో సోమవారం క్యూర్ పరిధిలోని డిప్యూటి కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, ఈఎస్‌లతో కమిషనర్ సమావేశాన్ని నిర్వహించారు.
క్యూర్ ఏర్పడిన మూడు నెలల్లో జరిగిన క్రైమ్‌పై కమిషనర్ సమీక్ష నిర్వహించారు.
క్రైమ్‌ను కంట్రోల్ తోపాటు బార్లు, మద్యం దుకాణాలకు సంబంధించిన ఎక్సైజ్ ఫీజ్ ఇన్స్టామెంట్స్ పై కూడ దృష్టి సారించాలని కమిషనర్ అధికారులను అదేశించారు.
ఈ సమావేశంలో అడిషనల్ కమిషనర్ సయ్యద్ యాషిన్ ఖురేషి, జాయింట్ కమిషనర్ అంజన్‌రావు, హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి డిప్యూటి కమిషనర్లు ఏ.శ్రీనివాసరెడ్డి, జె. హరికిషన్, పి. ప్రణవిలతోపాటు అసిస్టెంట్ కమిషనర్లు శీలం శ్రీనివాస్, డి.శ్రీనివాస్,జి.శ్రీనివాసరెడ్డి, ప్రదీప్రావులులతోపాటు ఈఎస్‌లు పాల్గొన్నారు
