ప్రకటన న్యూస్ ప్రతినిధి. బి. అనిత
హైదరాబాద్, 20 జూలై 2026: విద్యార్థు పై వేధింపులను ఆపి తమ చదువులను కొనసాగించనివ్వాలని, మద్యం తాగే వారిని, మద్యం బాటిల్స్ తో దొరికిన విద్యార్థిని ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, డిప్యుటేషన్ మీద వచ్చిన సత్యనారాయణ గారే కాపాడుతూ మా మీద బురద చల్లడం మానుకోవాలి.
అడ్మినిస్ట్రేషన్ కి నిజంగా చిత్త శుద్ధి ఉంటే గతం లో మేము వినతి పత్రం సమర్పించిన మాదిరిగా విశ్వ విద్యాలయం లోకి ఆల్కహాల్ ను రాకుండా నియంత్రించాలి, విశ్వ విద్యాలయ పరిసరాల్లో ఆల్కహాల్ షాప్ లకు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురండి.
ఈ రోజు అనగా శనివారం రోజున స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం (SPF) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి గారికి జేఎన్‌టీయూహెచ్ (JNTUH)లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యార్థి ప్రతినిధులపై జరుగుతున్న వేధింపులు, బెదిరింపులు మరియు ఉపకులపతిగా టీ కే కే రెడ్డి గారు వచ్చిన రోజు నుండి కొంత మంది అధికారులు అనుసరిస్తున్న తీరు పై, పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన పరిపాలనా వ్యవస్థపై
ప్రభుత్వమే ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసి సమగ్ర విచారణ జరపాలని ఫిర్యాదు చేయడం జరిగింది.
ఈ వినతిపత్రంతో పాటు విద్యార్థుల వాదనలకు, అధ్యాపకులు చేస్తున్న కుట్రపూరిత సర్క్యులర్ లకు సంబంధించిన 40 పేజీల ఆధార పత్రాలు మరియు సంఘటనలకు సంబంధించిన **ఆడియో, వీడియో ఆధారాలతో కూడిన ఒక సీడీ (CD)**ను కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి అందజేశాం.
విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను, విశ్వ విద్యాలయ ప్రతిష్ఠ దిగజారే విధముగా కొంత మంది అధికారులు చేస్తున్న పనులను ఉన్నత అధికారులు ఉపకులపతి, రెక్టర్ గారీ దృష్టికి తీసుకెళ్తే వాటికి పరిష్కారం చూపకుండా, ఆయా సమస్యలను వారి దృష్టి కి తీసుకు వెళ్లిన విద్యార్థి నాయకులను లక్ష్యంగా చేసుకుని బెదిరించడం, సస్పెన్షన్, రస్టికేషన్, అడ్మిషన్ రద్దు వంటి హెచ్చరికలు చేస్తూ విశ్వ విద్యాలయం లో భయానక పరిస్థితులు కల్పిస్తున్నారు. కనీసం విద్యార్థుల సమస్యలు వినేందుకు సైతం నిరాకరిస్తూ ఆంధ్రా ప్రాంత అధ్యాపకుడు రెక్టర్ దామోదరం గారు ప్రిన్సిపాల్ G.V. నరసింహ రెడ్డి గారు, ఆంధ్ర ప్రాంత ప్రొఫెసర్ రఘు రామ్ గారు, విశ్వ విద్యాలయం లోకి పోలీసుల ప్రవేశాన్ని ఆపాల్సిన అధికారులే వారిని పిలిపించి అరెస్టు చెయ్యండి అని చెప్తుండడం నిజంగా దారుణం, మరియు రెక్టర్ దామోదరం గారు తన పి ఏ ప్రసాద్ ను పిలిచి వీడియో లు తీయమని చెప్పడం, పోలీసుల కు అరెస్ట్ చేయండి అని సైగలు చేస్తున్నట్లు కళ్లకు కట్టినట్లుగా ఆ వీడియో లలో కనిపిస్తున్నాయి. అందుకు సంబంధించిన వీడియో లను సైతం సీడీ లో ఇవ్వడం జరిగింది. అదే విధంగా కొంత మంది అధ్యాపకులు ప్రభుత్వం పని చెయ్యమని చెప్పిన స్థానం లో పని చెయ్యకుండా ఆరోగ్యం బాలేదని సాకు గా చెప్పి హైదరాబాద్ కు డిప్యుటేషన్ మీద వచ్చి పక్కన ఉన్న అధికారుల మెప్పు పొందడానికి విద్యార్థుల మీద బహిరంగంగానే విరుచుకుపడుతున్న సత్యనారాయణ గారి ఆరోగ్యం అద్భుతం గా ఉన్నందున వెంటనే వారిని తను రిక్రూట్ అయిన స్థానానికి అనగా జేఎన్టీయూ జగిత్యాల కి పంపాలని డిమాండ్ చేయడం జరిగింది.

జేఎన్టీయూ లో జరుగుతున్న విద్యార్థి వ్యతిరేక మరియు ఉపకులపతి సంతుష్టీకరణ అంశాలపై ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి, పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని, జేఎన్‌టీయూహెచ్‌లో విద్యార్థులకు అనుకూలమైన విద్యా వాతావరణాన్ని, సమాజం లో జరుగుతున్న పరిస్థితులను వారూ అర్ధం చేసుకొని ప్రశ్నించే వాతావరణం కల్పించాలని ముఖ్యమంత్రిని కోరడం జరిగింది. ఒక వేళ ఉపకులపతులు విద్యార్థుల సమస్యలను వినేందుకు సుముఖంగా లేని పరిస్థితుల్లో రాష్ట్ర స్థాయిలో సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేయాలని, విద్యార్థి ప్రతినిధులపై ఎలాంటి కక్షసాధింపు చర్యలు జరగకుండా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశాం.ముఖ్యమంత్రి గారి కార్యాలయం లో సమర్పించిన ఆధారాలను పరిశీలించి విద్యార్థులకు న్యాయం చేస్తారని, జేఎన్‌టీయూహెచ్ ప్రతిష్ఠను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారని స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం (SPF) ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు దుర్గా ప్రసాద్, సాయి తనూజ్, సాగర్ నాయక్, గౌతం నాయక్, ఆనంద్, రాజ్ కుమార్, శ్రీనికేతన్, ధనుంజయ్, ఆదిత్య, రిత్విక్, రంజిత్ తదితరులు పాల్గొనారు.
స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం (SPF)
రిజిస్ట్రేషన్ నం.: 892/2024
