ఐబీడీ అవగాహన కార్యక్రమంతో “గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్™”లో చోటు దక్కించుకున్న యశోద హాస్పిటల్స్-సోమాజిగూడ
హైదరాబాద్, జూలై 17, 2026: సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ (IBD)పై నిర్వహించిన అతిపెద్ద అవగాహన కార్యక్రమంతో “గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్™”లో స్థానం సంపాదించింది. ప్రత్యక్షంగా మరియు ఆన్లైన్ ద్వారా మొత్తం 578 మంది ఒకేసారి పాల్గొని ఈ చారిత్రాత్మక ఘనతను సాధించారు. ప్రజల్లో IBDపై అవగాహన పెంపొందించడం, వ్యాధిని ముందుగానే గుర్తించేలా చేయడం యశోద హాస్పిటల్స్-సోమాజిగూడ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక అడ్జుడికేటర్ శ్రీ రిషి నాథ్ సమక్షంలో ఈ రికార్డును ధృవీకరించగా, డాక్టర్. కిరణ్ పెద్ది, సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ & డైరెక్టర్, సెంటర్ ఫర్ IBD మరియు డాక్టర్. ఎస్. ప్రశాంత్ రెడ్డి, యూనిట్ హెడ్, సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ ఈ అవార్డును స్వీకరించారు.
ఈ చారిత్రాత్మక విజయానంతరం “IBD కాంక్లావ్ 2.0” అంతర్జాతీయ శాస్త్రీయ సదస్సును యశోద హాస్పిటల్స్-సోమాజిగూడ విజయవంతంగా నిర్వహించింది. దేశ విదేశాల నుంచి 300 మందికి పైగా ప్రతినిధులు, ముగ్గురు అంతర్జాతీయ అధ్యాపకులు, 50 మందికి పైగా జాతీయ నిపుణులు పాల్గొని IBD చికిత్సలో అందుబాటులోకి వచ్చిన వైద్య పురోగతులు, బయోలాజిక్ థెరపీలు, శస్త్రచికిత్సలు, ఇంటెస్టైనల్ అల్ట్రాసౌండ్, కృత్రిమ మేధస్సు వినియోగం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.
*యశోద హాస్పిటల్స్-సోమాజిగూడ సెంటర్ ఫర్ ఐబీడీ డైరెక్టర్ & సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్. కిరణ్ పెద్ది* మాట్లాడుతూ, “సెంటర్ ఫర్ ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ లో ప్రతి రోగికి ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించడమే మా లక్ష్యం. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్™ గుర్తింపు మా వైద్య బృందం అంకితభావానికి, రోగి కేంద్రిత సేవలకు నిదర్శనం అని అన్నారు. ఐబీడీ వంటి దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో ముందస్తు నిర్ధారణ, సరైన చికిత్స, నిరంతర వైద్య పర్యవేక్షణ ఎంతో కీలకం అని అన్నారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా రోగులు, వారి కుటుంబ సభ్యులు, సాధారణ ప్రజల్లో ఐబీడీపై అవగాహన పెంచడంతో పాటు, లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో నిపుణులను సంప్రదించేలా ప్రోత్సహించగలిగామని మేము విశ్వసిస్తున్నాం. భవిష్యత్తులో కూడా అత్యాధునిక వైద్య సేవలు, పరిశోధన, విద్య, ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాల ద్వారా ఐబీడీ చికిత్సలో దేశానికి ఆదర్శంగా నిలవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతాము,” అని *డాక్టర్. కిరణ్ పెద్ది* అన్నారు.
*యశోద హాస్పిటల్స్, డైరెక్టర్ డాక్టర్. పవన్ గోరుకంటి* మాట్లాడుతూ, “వైద్య రంగంలో అత్యుత్తమ చికిత్స అందించడం మాత్రమే కాకుండా సమాజ ఆరోగ్యాభివృద్ధికి తోడ్పడే ప్రజారోగ్య కార్యక్రమాలు నిర్వహించడం కూడా యశోద హాస్పిటల్స్ బాధ్యతగా భావిస్తోంది అని అన్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్™లో చోటు సంపాదించడం మా సంస్థకు ఎంతో గర్వకారణం. ఈ విజయం వెనుక వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ బృందం, నిర్వాహకులు మరియు ప్రతి ఉద్యోగి సమిష్టి కృషి ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ఐబీడీపై అవగాహనను దేశవ్యాప్తంగా మరింత విస్తరించగలిగాం. ప్రపంచ స్థాయి వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తూ, పరిశోధన, వైద్య విద్య, సాంకేతికత, ప్రజారోగ్య అవగాహన కార్యక్రమాల ద్వారా భారతదేశ ఆరోగ్యరంగ అభివృద్ధికి యశోద హాస్పిటల్స్ తన వంతు సేవలను మరింత విస్తృతంగా కొనసాగిస్తుంది,” అని *డాక్టర్. పవన్ గోరుకంటి* తెలిపారు.
ఈ సందర్భంగా *గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్™ అధికారిక అడ్జుడికేటర్ శ్రీ రిషి నాథ్* మాట్లాడుతూ, పెద్ద సంఖ్యలో ప్రజల భాగస్వామ్యంతో పాటు సమాజానికి నిజమైన ప్రయోజనం చేకూర్చిన అరుదైన కార్యక్రమం ప్రజారోగ్య అవగాహనను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అనుసంధానిస్తూ యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ నిర్వహించిన ఈ కార్యక్రమం విశేషమైనది. కేవలం ఒక ప్రపంచ రికార్డును నెలకొల్పడమే కాకుండా, వందలాది మందికి ఆరోగ్య అవగాహన కల్పించడం ద్వారా సమాజంపై సానుకూల ప్రభావం చూపిన కార్యక్రమంగా ఇది నిలిచిపోతుంది అని అన్నారు. ప్రజా ప్రయోజనం, వైద్య విజ్ఞానం, విస్తృత భాగస్వామ్యాన్ని సమన్వయం చేసిన ఈ కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్™ స్ఫూర్తికి పూర్తిగా అనుగుణంగా ఉంది. ఈ చారిత్రాత్మక విజయానికి యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ బృందానికి నా హృదయపూర్వక అభినందనలు,” అని పేర్కొన్నారు.
For further information, please contact: Mr. Sampath Mobile: +91 78930 53355 / +91 88971 96669
