Sun, 22 Nov 2026
🔴 BREAKING
ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రారంభోత్సవం రోజునే రూ.800 కోట్ల అమ్మకాలు సాధించిన ఏఎస్‌బీఎల్‌ లెగసీ నవనిర్మాణ్ ఫౌండేషన్ మరియు ట్రూ కనెక్ట్ ఈవెంట్స్ అండ్ ఎక్స్‌పోస్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్ సమీపంలోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న FAABXPO 2026 – ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ ఎక్స్‌పో GeM పోర్టల్ ద్వారా అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకున్న ట్రైబల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ( టిక్కి) నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఎపిక్ ఇంటర్నేషనల్ హాస్పిటల్‌ను ప్రారంభించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే విశిష్ట సామాజిక సేవకు గాను డాక్టర్ విజయరాజ్ గడ్డం గారికి ప్రతిష్టాత్మక “సేవా రత్న” పురస్కారం
Uncategorized

ఎన్టీఆర్ గార్డెన్స్‌లో ఘనంగా సదర్ సమ్మేళనం

ముఖ్య అతిథులుగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ గార్డెన్స్‌లో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో సదర్ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత శ్రీ తేజస్వి యాదవ్, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సదర్ సమ్మేళనంలో యాదవ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంప్రదాయాలు, సంస్కృతి, ఐక్యతకు ప్రతీకగా నిలిచే సదర్ ఉత్సవాలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు హనుమంతరావు, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్, పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యాదవ సంఘాల ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *