రికార్డు నమోదు చేసినట్లుగా ధృవీకరించిన ప్రపంచ రికార్డుల నేషనల్ కోఆర్డినేటర్ లయన్ కె వి రమణారావు.
స్పందన నృత్యకేళి స్కూల్ ఆఫ్ డాన్స్ ఆధ్వర్యంలో నిన్న కొంపల్లిలోని పియర్సన్ స్కూల్ వేదికగా “గణ నృత్యం” పేరుతో అద్భుతమైన ప్రపంచ రికార్డుల కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.
ఈ వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేసి, అద్భుతమైన ఆలోచనను కార్యరూపంలోకి తీసుకొచ్చిన వారు ప్రముఖ కూచిపూడి నృత్య గురువు డా. ఎన్. రవికుమార్ గారు.
ఈ కార్యక్రమంలో 12 సంవత్సరాల చిన్నారి రుంకు వైష్ణవి ఏకధాటిగా 12 గంటల పాటు కూచిపూడి నృత్య ప్రదర్శన చేసి అందరినీ అబ్బురపరిచింది. 122 భంగిమలు, 522 పాటలకు అనుగుణంగా నృత్యం చేస్తూ తన అసాధారణ ప్రతిభను చాటుకుంది. ఈ అద్భుత ప్రదర్శనతో వైష్ణవి 12 ప్రపంచ రికార్డులు…యూనివర్సల్ బుక్ ఆఫ్ రికార్డ్స్,నోబెల్ వరల్డ్ రికార్డ్స్,భారత్ వరల్డ్ రికార్డ్స్,నేషనల్ ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్స్ బుక్, అమేజింగ్ కిడ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, కళాకార్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఎక్సెలెన్సీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్,ఇండియా ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్స్,తెలుగు వరల్డ్ రికార్డ్స్,హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, చిల్డ్రన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, డిల్లీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తదితర ప్రపంచ రికార్డులలో స్థానం సంపాదించి పలువురి ప్రశంసలు అందుకున్నారు.
ఈ కార్యక్రమానికి భారత్ వరల్డ్ రికార్డ్స్ అధ్యక్షుడు,
ప్రపంచ రికార్డుల నేషనల్ కో-ఆర్డినేటర్ లయన్ కె.వి. రమణారావు ముఖ్య అతిథిగా,మిస్ గార్జియస్ ఇండియా 2026 టైటిల్ విన్నర్ ప్రపంచ రికార్డుల జ్యూరీ సభ్యులు అలిసియా జోసెఫ్, రాష్ట్ర ప్రతినిథి దండు ఉషశ్రీ లు విచ్చేసి, వైష్ణవి అద్భుత నృత్య ప్రదర్శనను వీక్షించి ఆమెకు 12 ప్రపంచ రికార్డుల గుర్తింపు పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి గారు, జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మరియు టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ బొంగూరి మహేందర్ రెడ్డి గారు విచ్చేసి చిన్నారి వైష్ణవి ప్రతిభను, గురువు డా. ఎన్. రవికుమార్ గారి కృషిని అభినందించారు.
అలాగే ప్రముఖులు శ్రీ నెమూరి శంకర్ గౌడ్, శ్రీ ప్రేమ్ కుమార్, శ్రీ అల్లాడి తనీష్, శ్రీ ఎరుకొండ రాజు, శ్రీ కుప్ప శ్రీకాంత్ గౌడ్, శ్రీ జక్క కృష్ణ, శ్రీ నందగిరి సతీష్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై తమ అభినందనలు తెలియజేశారు.
కేవలం 12 సంవత్సరాల వయసులో ఏకధాటిగా 12 గంటల పాటు కూచిపూడి నృత్యం చేయడం ఎంతో విశేషం. వైష్ణవి సాధన, పట్టుదల, అంకితభావం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.
ఒక అద్భుతమైన ఆలోచనకు రూపకల్పన చేసి, కూచిపూడి కళా వైభవాన్ని ప్రపంచానికి చాటేలా చేసిన గురువు డా. ఎన్. రవికుమార్ గారికి, 12 ప్రపంచ రికార్డులను సాధించిన చిన్నారి రుంకు వైష్ణవికి, సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు.
సంప్రదాయ కళకు సరికొత్త గుర్తింపు. కూచిపూడి వైభవానికి ప్రపంచ వేదికపై మరో చారిత్రాత్మక మైలురాయి!
స్పందన నృత్యకేళి – కళా వైభవానికి, ప్రతిభకు, ప్రపంచ గుర్తింపునకు వేదిక
