Fri, 02 Oct 2026
🔴 BREAKING
జింఖానా గ్రౌండ్స్ లో కుకి స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ‘చవాంగ్ గోల్ సే 2026’ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే  శ్రీగణేష్  అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ, పీ.జీ ప్రవేశ గడువు పోడుగింపు రిజిస్ట్రేషన్, ట్యూషన్ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ 13 అక్టోబర్ 2026 అక్టోబర్ 7, 2026న డా. బి. ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27 వ స్నాతకోత్సవం ది ప్లాజా హోటల్, బేగంపేట లో తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభం
Uncategorized

గుండె శస్త్రచికిత్స అనంతరం గాదె మాధవ రెడ్డి గారిని పరామర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, భద్రాచలం నియోజకవర్గం

భద్రాచలం వెంకటేశ్వర కాలనీ మొదటి వీధిలో నివాసం ఉంటున్న ప్రముఖ సంఘ సేవకులు పట్టణ ప్రముఖులు గాదె మాధవ రెడ్డి గారు ఇటీవల హైదరాబాద్‌లో గుండె శస్త్రచికిత్స చేయించుకుని ఇంటికి తిరిగి వచ్చిన విషయం తెలుసుకున్న భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు మంగళవారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.

ఈ సందర్భంగా మాధవ రెడ్డి గారి ఆరోగ్య పరిస్థితిని ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం పూర్తిగా కోలుకునే వరకు తగిన విశ్రాంతి తీసుకోవాలని, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలని సూచించారు. త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.పరిపూర్ణమైన ఆరోగ్యం తర్వాత ప్రజల్లోకి వచ్చి ప్రజా సేవ చేయాలని చేయటానికి ఆ భగవంతుడు పూర్తిగా అనుగ్రహించాలని అప్పటివరకు తగిన విశ్రాంతి తీసుకుని టైం కు మందులు వేసుకోవాలని సూచించారు

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు భీమవరపు వెంకటరెడ్డి, చేగొండి శ్రీనివాస్, యూత్ నాయకులు మాచినేని భాను గాడి విజయ్. తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *