Fri, 06 Nov 2026
🔴 BREAKING
ఎన్టీఆర్ గార్డెన్స్‌లో ఘనంగా సదర్ సమ్మేళనం పవర్ గ్రిడ్ SR-I ఆధ్వర్యంలో శిల్పకళా వేదికలో ఘనంగా ప్రాంతీయ సాంస్కృతిక సమ్మేళనం, హస్తకళల ప్రదర్శన రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు కూచిపూడి నృత్యంలో ఒకేసారి 12 ప్రపంచ రికార్డులు సాధించిన కుమారి రుంకు వైష్ణవి. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆదిలాబాద్‌కు ఏం చేశారు? కేటీఆర్ సమాధానం చెప్పాలి విల్లా మేరీ మహిళా డిగ్రీ కళాశాల స్నాతకోత్సవం 2026 హైదరాబాద్, అక్టోబర్ 31, 2026: విల్లా మేరీ మహిళా డిగ్రీ కళాశాల, హైదరాబాద్‌, సెయింట్ జోసెఫ్ ఆడిటోరియంలో, 2023–2026 గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్‌కు అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలను ప్రదానం చేస్తూ, తన స్నాతకోత్సవం 2026ను ఘనంగా నిర్వహించింది
Uncategorized

జూబ్లీహిల్స్ నియోజకవర్గం, బిఆర్ఎస్ ఇన్చార్జ్ శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం యూసఫ్ గూడా మరియు వెంగల్ రావు నగర్ డివిజన వాసులతో బతుకమ్మ సంబరాలు మహమూద్ ఫంక్షన్ హాల్ లో వైభవంగా నిర్వహించారు.

యూసఫ్ గూడా మరియు వెంగల్ రావు నగర్ డివిజన్ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారు ప్రతి సంవత్సరం ప్రజలతో కలిసి బతుకమ్మ పండుగను జరిపే వారని ఆయన లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిదని ఆయన సతీమణిగా ఆయన ప్రారంభించిన కార్యక్రమాలను ప్రతి సంవత్సరం కొనసాగిస్తానని అన్నారు. ఈ కార్యక్రమాలు ఏ రాజకీయ లబ్ధి కోసం కాదు, ఏ పదవి కోసం కాదు! గోపీనాథ్ గారు ఎక్కడికి వెళ్లిపోలేదు, మీరు జరుపుకునే ప్రతి పండుగలో మీ ఆనందంలో మీ చిరునవ్వుల్లో ఆయన ఎప్పటికీ మనతోనే ఉంటారు అని అన్నారు. ఆయన ప్రజలనే తన కుటుంబంగా భావించిన గొప్ప నాయకుడని కొనియాడారు.ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తాను అని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజల ప్రేమ ఆదరణ వారి ఆశీస్సులు ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్పూర్తిగా కోరుకున్నారు.ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహిళలకు మాగంటి సునీత బతుకమ్మ కానుకను పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో మాజి కార్పొరేషన్ చైర్మన్ గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు విచ్చేశారు. కుమార్తెలు మాగంటి అక్షర, మాగంటి దిశిరా మరియు వివిధ డివిషన్లోని సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *