Sun, 22 Nov 2026
🔴 BREAKING
ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రారంభోత్సవం రోజునే రూ.800 కోట్ల అమ్మకాలు సాధించిన ఏఎస్‌బీఎల్‌ లెగసీ నవనిర్మాణ్ ఫౌండేషన్ మరియు ట్రూ కనెక్ట్ ఈవెంట్స్ అండ్ ఎక్స్‌పోస్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్ సమీపంలోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న FAABXPO 2026 – ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ ఎక్స్‌పో GeM పోర్టల్ ద్వారా అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకున్న ట్రైబల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ( టిక్కి) నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఎపిక్ ఇంటర్నేషనల్ హాస్పిటల్‌ను ప్రారంభించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే విశిష్ట సామాజిక సేవకు గాను డాక్టర్ విజయరాజ్ గడ్డం గారికి ప్రతిష్టాత్మక “సేవా రత్న” పురస్కారం
Uncategorized

కింగ్ కోఠిలోని భారతీయ విద్యాభవన్ ఆడిటోరియంలో ‘జైన్ జాగృతి సెంటర్’ ఆధ్వర్యంలో నిర్వహించిన స్టాండప్ కామెడీ మరియు కాన్సెప్చువల్ షో కార్యక్రమం

మోదీ సంకల్పానికి హైదరాబాద్ వాక్‌తో మద్దతు పలుకుదాం

​ఈ నెల 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్’ పేరిట మూడు రోజుల వాక్

​హైదరాబాద్:
దేశ భవిష్యత్తుకు పెను సవాలుగా మారిన డ్రగ్స్ మహమ్మారిని రూపుమాపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కంకణం కట్టుకున్నారని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. కింగ్ కోఠిలోని భారతీయ విద్యాభవన్ ఆడిటోరియంలో ‘జైన్ జాగృతి సెంటర్’ ఆధ్వర్యంలో నిర్వహించిన స్టాండప్ కామెడీ మరియు కాన్సెప్చువల్ షో కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న మన దేశంలో మాదకద్రవ్యాలు యువశక్తిని నిర్వీర్యం చేస్తూ వారిని పక్కదారి పట్టిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ప్రమాదాన్ని గుర్తించిన ప్రధాని మోదీ డ్రగ్స్‌పై యుద్ధం ప్రకటించారని తెలిపారు. గతంలో ఆర్టికల్ 370, ‘సర్జికల్ స్ట్రైక్’.. తరహాలోనే ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలను తీసుకొని విజయవంతం చేసిన మోదీ గారు, ఇప్పుడు దేశం నుంచి డ్రగ్స్‌ను పూర్తిగా తరిమికొట్టే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని అన్నారు.ప్రధాని పిలుపు మేరకు, డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో భాగంగా ఈ నెల 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్ నగరంలో ‘నషా ముక్త్ భారత్’ (Nasha Mukt Bharat) పేరిట మూడు రోజుల పాటు భారీ అవగాహన నడక (హైదరాబాద్ వాక్) నిర్వహిస్తున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు.

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం జరిగే ఈ బృహత్తర కార్యక్రమంలో యువత, నగర ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *