హైదరాబాద్‌లో సెవెన్ హిల్స్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్’, తమ నాలుగవ శాఖను హబ్సిగూడ, వివేకానంద నగర్ లో ముఖ్య అతిథిగా విచ్చేసిన మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ పార్లమెంటు సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ ప్రారంభించారు.
గౌరవ అతిథిగా విచ్చేసిన అఖిల భారత మహేశ్వరి మహాసభ ఉపాధ్యక్షులు శ్రీ అరుణ్ కుమార్ భంగడియా గారు, బ్యాంకు యొక్క స్ట్రాంగ్ రూమ్‌ను ప్రారంభించారు.
కొత్త కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బ్యాంకు చైర్మన్ శ్రీ కైలాష్‌జీ దాలియా మాట్లాడుతూ, 1998లో హైదరాబాద్‌లో స్థాపించబడిన తమ బ్యాంకు, ప్రస్తుతం మహబూబ్‌గంజ్, అత్తాపూర్ మరియు అలకాపురిలలో మూడు శాఖల ద్వారా బ్యాంకింగ్ సేవలను అందిస్తోందని, నేడు హబ్సిగూడ, వివేకానంద నగర్, స్ట్రీట్ నం. 8 వద్ద నాలుగవ శాఖను ప్రారంభిస్తున్నామని తెలిపారు.
చైర్మన్ ఇంకా మాట్లాడుతూ, తాము డిపాజిట్లు, రుణాలు మరియు అడ్వాన్సులపై ఆకర్షణీయమైన పథకాలను అందించడమే కాకుండా, IMPS, UPI (గూగుల్ పే, ఫోన్ పే మొదలైన) వంటి డిజిటల్ బ్యాంకింగ్ సేవలను కూడా కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
31.03.2026 నాటికి, బ్యాంకులో రూ. 5417.25 లక్షల డిపాజిట్లు, రూ. 3541.27 లక్షల రుణాలు (అడ్వాన్సులు) ఉన్నాయి. అలాగే, బ్యాంకు సొంత నిధులు రూ. 837.98 లక్షలుగా ఉన్నాయి.
బ్యాంకుకు నిరంతరం మద్దతునిస్తున్న మరియు ప్రోత్సాహాన్నిస్తున్న కస్టమర్లందరికీ, వాటాదారులందరికీ చైర్మన్ గారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ వైస్ చైర్మన్ శ్రీ రామనివాస్ శారదా, వైస్ చైర్మన్ శ్రీ సంజయ్ కుమార్ లాహోటి, మరియు ఇతర డైరెక్టర్లు శ్రీ మహేష్ కలంత్రి, శ్రీ రమేష్ అథస్నియా, శ్రీ హనుమాన్‌దాస్ మాలు, శ్రీ విమల్ కిషోర్ సోని, శ్రీ రాజేంద్ర ప్రసాద్ రాఠీ, శ్రీ లక్ష్మీనారాయణ మలానీ, శ్రీ రాజేష్ కుమార్ రాఠీ, శ్రీమతి లలితా మలాని, మంజులత బూబ్, శ్రీ దినేష్ కుమార్ గిల్డా మరియు సీఈఓ శ్రీ పి. రాజారావు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ముఖ్య కార్యనిర్వాహణాధికారి తదితరులు పాల్గొన్నారు.
