Sat, 07 Nov 2026
🔴 BREAKING
ఎన్టీఆర్ గార్డెన్స్‌లో ఘనంగా సదర్ సమ్మేళనం పవర్ గ్రిడ్ SR-I ఆధ్వర్యంలో శిల్పకళా వేదికలో ఘనంగా ప్రాంతీయ సాంస్కృతిక సమ్మేళనం, హస్తకళల ప్రదర్శన రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు కూచిపూడి నృత్యంలో ఒకేసారి 12 ప్రపంచ రికార్డులు సాధించిన కుమారి రుంకు వైష్ణవి. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆదిలాబాద్‌కు ఏం చేశారు? కేటీఆర్ సమాధానం చెప్పాలి విల్లా మేరీ మహిళా డిగ్రీ కళాశాల స్నాతకోత్సవం 2026 హైదరాబాద్, అక్టోబర్ 31, 2026: విల్లా మేరీ మహిళా డిగ్రీ కళాశాల, హైదరాబాద్‌, సెయింట్ జోసెఫ్ ఆడిటోరియంలో, 2023–2026 గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్‌కు అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలను ప్రదానం చేస్తూ, తన స్నాతకోత్సవం 2026ను ఘనంగా నిర్వహించింది
Uncategorized

నాంపల్లి చేనేత భవన్ లో తెలంగాణ చేనేత అభివృద్ధి కార్పొరేషన్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి, కార్యాలయాన్ని ప్రారంభించిన నూతన చైర్మన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు.

రాష్ట్రవ్యాప్తంగా చేనేత ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ అవకాశాలు కల్పించాలి.చేనేత కార్మికులకు మెరుగైన ఉపాధి, ఆర్థిక ప్రయోజనాలు కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తుంది.

నాంపల్లి లోని తెలంగాణ రాష్ట్ర చేనేత కార్మికుల సహకార సంఘం లిమిటెడ్ (TGSCO) కార్యాలయంలో తెలంగాణ చేనేత ఉత్పత్తులను పరిశీలించి చేనేత వస్త్రాలను కొనుగోలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్.తెలంగాణ చేనేత వస్త్రాలకు రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలి.

దేవాలయాల్లో, అధికారిక కార్యక్రమాల్లో, ఉపాధ్యాయులు, ప్రముఖుల సన్మానాల్లో సాధారణ సిల్క్ శాలువాలకు బదులుగా చేనేత శాలువాలను వినియోగించాలి. రాజకీయ నాయకులు పరస్పరం గౌరవించుకునే కార్యక్రమాల్లోనూ చేనేత శాలువాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.చేనేత వస్త్రాల వినియోగాన్ని ప్రోత్సహించేలా అన్ని ప్రభుత్వ శాఖలకు తగిన సూచనలు, మార్గదర్శకాలు జారీ చేయాలి.

ముడిసరుకు నుంచి వస్త్రాల తయారీ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వరకు చేనేత రంగంలోని ప్రతి వర్గానికీ ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలి.

చేనేత కార్మికుల ఉత్పత్తులకు సరైన మార్కెట్ కల్పించి, వారి కష్టానికి తగిన ప్రతిఫలం అందేలా చూడాలి. చేనేత రంగ అభివృద్ధి ద్వారా కార్మికులకు ఆర్థిక భద్రతతో పాటు సామాజికంగా గౌరవప్రదమైన జీవనం కల్పిస్తుంది.విద్యార్థి దశ నుంచి రాజకీయ జీవితంలో కష్టపడి పనిచేసిన స్ఫూర్తితో, నూతన చైర్మన్ చేనేత రంగ అభివృద్ధికి మరింత అంకితభావంతో పనిచేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *