దసరా నవరాత్రులు మొదలైనప్పటినుండి జరుగుతున్న బతుకమ్మ సంబరాల ను జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో ఉన్న డివిజన్ లలో ప్రతిరోజు ఒక్కొక్క డివిజన్ లలో బతుకమ్మ సంబరాలను భారత రాష్ట్ర సమితి పార్టీ ఆదేశాలు ప్రకారం ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు జూబ్లీహిల్స్ బిఆర్ఎస్ పార్టీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని మాగంటి సునీత గోపీనాథ్. ఆ క్రమంలో భాగంగా గురువారం యూసఫ్ గూడా డివిజన్ మహమూద్ ఫంక్షన్ హాల్ లో అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు.
దాదాపుగా 3,000 మంది మహిళలు ఈ కార్యక్రమంలో ఆడి పాడి బతుకమ్మ సంబరాలలో పాల్గొన్నారు. ప్రతి డివిజన్ లలో గతం లో జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే, దివంగత మాగంటి గోపినాథ్ బతుకమ్మ ఆడిన ప్రతి మహిళకు చీరను కానుకగా ఇచ్చే సంప్రదాయం ను మాగంటి సునీత గోపీనాథ్ పాటించి వచ్చిన ప్రతి మహిళకు చీరను కానుకగా అందజేశారు. పద్ధతిగా సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు సంబరాలు అంబరాన్ని అంటాయి.
ఈ బతుకమ్మ సంబరాలకు మధురానగర్ పోలీస్ స్టేషన్ సిఐ ప్రభాకర్ శాంతి భద్రతల కు భంగం కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. యూసఫ్ గూడా డివిజన్ కి సంబంధించిన బిఆర్ఎస్ పార్టీ వివిధ హోదాలు నాయకులు, మహిళా నాయకురాళ్ళు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, గౌరమ్మ, వంటి హు షారైన భక్తి గీతాలు తో మహమ్మద్ ఫంక్షన్ హాల్ ప్రాంతం మొత్తం భక్తిమయమైంది.
