Mon, 23 Nov 2026
🔴 BREAKING
ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రారంభోత్సవం రోజునే రూ.800 కోట్ల అమ్మకాలు సాధించిన ఏఎస్‌బీఎల్‌ లెగసీ నవనిర్మాణ్ ఫౌండేషన్ మరియు ట్రూ కనెక్ట్ ఈవెంట్స్ అండ్ ఎక్స్‌పోస్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్ సమీపంలోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న FAABXPO 2026 – ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ ఎక్స్‌పో GeM పోర్టల్ ద్వారా అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకున్న ట్రైబల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ( టిక్కి) నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఎపిక్ ఇంటర్నేషనల్ హాస్పిటల్‌ను ప్రారంభించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే విశిష్ట సామాజిక సేవకు గాను డాక్టర్ విజయరాజ్ గడ్డం గారికి ప్రతిష్టాత్మక “సేవా రత్న” పురస్కారం
Uncategorized

విద్యార్థుల్లో విలువల పెంపొందింపే లక్ష్యంగా ‘పరివర్తన్’ కార్యక్రమం

హైదరాబాద్: విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే కుటుంబ విలువలు, పర్యావరణ పరిరక్షణ, నీటి ప్రాముఖ్యత, ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలు, పౌర బాధ్యత, సమానత్వం, స్వదేశీ భావన వంటి విలువలపై అవగాహన పెంపొందించేందుకు ఇనిషియేటివ్ ఫర్ మోరల్ అండ్ కల్చరల్ ట్రైనింగ్ ఫౌండేషన్ (IMCTF) ఆధ్వర్యంలో ‘పరివర్తన్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.తరగతి గదిలోనే రోజువారీ బోధనలో భాగంగా విలువలను విద్యార్థులకు అందించడం, చిన్నచిన్న కార్యక్రమాల ద్వారా వారి ఆలోచనా విధానం, ప్రవర్తనలో సానుకూల మార్పు తీసుకురావడం వంటి అంశాలపై పాఠశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపల్స్ మరియు ఉపాధ్యాయులకు అవగాహన కల్పించనున్నారు.

ఈ కార్యక్రమంలో విలువల ఆధారిత విద్యకు సంబంధించిన ప్రత్యేక పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. పాఠశాలల్లో ఆచరణలో పెట్టగల వివిధ కార్యక్రమాలు, బోధనా విధానాలపై మార్గదర్శకత్వం అందించనున్నారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ గౌరవనీయ గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్ల గారు ముఖ్య అతిథిగా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ నవీన్ నికోలస్ గారు విశిష్ట అతిథిగా పాల్గొననున్నారు. విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్రం ప్రధాన కార్యదర్శి శ్రీ లింగం సుధాకర్ రెడ్డి గారు ముఖ్య వక్తగా పాల్గొంటారు.‘పరివర్తన్’ కార్యక్రమం అక్టోబర్ 28, 2026 బుధవారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లోని రాజ్ భవన్ స్కూల్ సమీపంలోని సంస్కృతి ఆడిటోరియంలో నిర్వహించనున్నారు.

హైదరాబాద్ నగరంలోని పాఠశాలల కరస్పాండెంట్లు, యాజమాన్యాలు, ప్రిన్సిపల్స్, ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని IMCTF zone committee ప్రతినిధులు కోరారు.“విలువల నిర్మాణమే – దేశ నిర్మాణం” – IMCTF హైదరాబాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *