నకిలీ దస్తావేజులు సృష్టించి వ్యవసాయ భూములను రైతుల నుంచి బలవంతంగా లాక్కుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని పచ్చని పొలాలను పరిరక్షించాలని కొంగర కుర్దు గ్రామ రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతులు భూపాల్ రెడ్డి, పన్నాల యాది రెడ్డి, సమ్మి రెడ్డి కృష్ణా రెడ్డిలు మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కొంగర కుర్దు గ్రామంలోని 32 సర్వే నెంబర్ల పరిధిలో గల వ్యవసాయ భూములను గత 35 సంవత్సరాలుగా తాము వ్యవసాయం చేసుకుంటున్నట్లు తెలిపారు. కాగా గత రెండు నెలలుగా కొందరు భూ కబ్జాదారులు బినామీ పేర్లతో నకిలీ ఓ ఆర్ సి లను సృష్టించి కబ్జాకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఈ విషయంపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్, కందుకూరు ఆర్డీవో, మహేశ్వరం ఎమ్మార్వో కు ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. కబ్జాదారులతో
స్థానిక రెవెన్యూ అధికారులు, పోలీసులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కుమ్మక్కై పచ్చని పొలాలను కబ్జాదారుల హస్తగతం చేస్తున్నారని ఆరోపించారు. అధికారుల అండదండలతో రాత్రికి రాత్రే వ్యవసాయ పొలాల్లోకి అక్రమంగా చొరబడుతున్న కబ్జాదారులు పొలాలను నాశనం చేస్తున్నారని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి కబ్జాదారుల ఆగడాలను అరికట్టడంతో పాటు తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. శ్రీధర్ రెడ్డి, బాధిత రైతు
