మహిళా సాధికారత, నాయకత్వం, సామాజిక సేవ, భారతీయ సంస్కృతి పరిరక్షణలో విశేష కృషికి పురస్కారం
హైదరాబాద్: మహిళా శక్తి, నాయకత్వం, సేవాభావం, స్ఫూర్తిదాయక విజయాలను గౌరవించే ప్రతిష్ఠాత్మక ‘మనోరమా కాందార్ నారీ శక్తి అవార్డు–2026’ ప్రముఖ పారిశ్రామికవేత్త, సాంస్కృతిక కార్యకర్త జెనీ మోమయాకు ప్రదానం చేశారు. మహిళా సాధికారత, వ్యాపార రంగంలో నాయకత్వం, భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ఆమె అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది.
దివంగత శ్రీమతి మనోరమా కాందార్ స్మారకార్థం అందిస్తున్న ఈ పురస్కారాన్ని జైన్ జాగృతి సెంటర్ ఆధ్వర్యంలో మేఘ్నా (మిల్టు) మెహతా రూపకల్పన చేశారు. మహిళల్లోని ప్రతిభ, నాయకత్వ లక్షణాలు, సమాజానికి వారు అందిస్తున్న సేవలను గుర్తించి గౌరవించడమే ఈ అవార్డు ప్రధాన ఉద్దేశం. మహిళల శక్తి, సేవ, స్ఫూర్తిని ప్రతిబింబించే ఈ పురస్కారానికి జెనీ మోమయా ఎంపిక కావడం విశేషం.
గౌరవ్ క్యాటరర్స్ సంస్థకు డైరెక్టర్గా వ్యవహరిస్తున్న జెనీ మోమయా హైదరాబాద్, సికింద్రాబాద్లో ప్రముఖ శాఖాహార క్యాటరింగ్ సేవల అభివృద్ధిలో భాగస్వామిగా ఉన్నారు. అంతర్జాతీయ క్యాటరింగ్ రంగంలోనూ అనుభవం సంపాదించడంతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి సేవలు అందించే అవకాశం పొందారు.
సుమారు 40 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రముఖ మహిళా సంస్థ సంస్కృతికి గతంలో అధ్యక్షురాలిగా పనిచేసిన ఆమె మహిళల ఐక్యత, సాధికారతకు కృషి చేశారు. హైదరాబాద్లో గర్బా సంస్కృతిని ప్రోత్సహించడంలోనూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ముంబైకి చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్లు జిగర్ సోనీ, పార్థ్, హార్దిక్ మెహతాలను హైదరాబాద్కు ఆహ్వానించి ప్రత్యేక గర్బా శిక్షణ శిబిరాలను ప్రారంభించారు.
అలాగే జంట నగరాల్లో ప్రముఖంగా నిర్వహించే నాంధారి గౌరవ్ నవరాత్రి ఉత్సవ్ నిర్వాహకుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ఈ ఉత్సవాల్లో 200 మందికి పైగా కళాకారులు ఒకేసారి గర్బా ప్రదర్శనలు ఇవ్వడం ప్రత్యేక ఆకర్షణ. నాలుగేళ్ల చిన్నారుల నుంచి 80 ఏళ్లకు పైబడిన వృద్ధుల వరకు పాల్గొనే ఈ వేడుకలు సాంస్కృతిక ఐక్యతకు వేదికగా నిలుస్తున్నాయి. ఈ ఉత్సవాలకు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, నందిని మల్లు తదితర ప్రముఖులు హాజరయ్యారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరిస్తున్న జెనీ మోమయా గతంలో ఐఐఐడీ హెచ్ఆర్సీ అవార్డుతో పాటు సెలబ్రిటీ సీక్రెట్స్ సంస్థ నుంచి కూడా పురస్కారాన్ని అందుకున్నారు. వ్యాపార రంగంలో విజయం సాధించడంతో పాటు మహిళా సాధికారత, సాంస్కృతిక పరిరక్షణ, సామాజిక ఐక్యతకు తనవంతు కృషి చేస్తున్న జెనీ మోమయాకు మనోరమా కాందార్ నారీ శక్తి అవార్డు–2026 లభించడం ఆమె సేవలకు మరో విశిష్ట గుర్తింపుగా నిలిచింది.
“మన శక్తిమేరకు అత్యుత్తమంగా పనిచేయాలి.. మన చుట్టూ ఉన్నవారిని ప్రోత్సహించాలి.. లక్ష్యం, అభిరుచి, సానుకూల దృక్పథంతో మహిళా శక్తిని చాటాలి” అనే ఆమె జీవిత సూత్రం ఈ పురస్కార స్ఫూర్తికి అద్దం పడుతోంది.
