Sun, 22 Nov 2026
🔴 BREAKING
ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రారంభోత్సవం రోజునే రూ.800 కోట్ల అమ్మకాలు సాధించిన ఏఎస్‌బీఎల్‌ లెగసీ నవనిర్మాణ్ ఫౌండేషన్ మరియు ట్రూ కనెక్ట్ ఈవెంట్స్ అండ్ ఎక్స్‌పోస్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్ సమీపంలోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న FAABXPO 2026 – ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ ఎక్స్‌పో GeM పోర్టల్ ద్వారా అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకున్న ట్రైబల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ( టిక్కి) నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఎపిక్ ఇంటర్నేషనల్ హాస్పిటల్‌ను ప్రారంభించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే విశిష్ట సామాజిక సేవకు గాను డాక్టర్ విజయరాజ్ గడ్డం గారికి ప్రతిష్టాత్మక “సేవా రత్న” పురస్కారం
Uncategorized

ట్రాన్స్‌జెండర్ వ్యక్తులపై సలహా కమిటీ దక్షిణ ప్రాంతీయ సంప్రదింపుల సమావేశం

తెలంగాణ ప్రభుత్వం ‌దివ్యాంగులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ, హైదరాబాద్

గౌరవ భారత సుప్రీంకోర్టు W.P.(C) No. 1405/2023, జానే కౌశిక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మరియు ఇతరులు కేసులో ఇచ్చిన తీర్పు మేరకు, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి గౌరవ జస్టిస్ శ్రీమతి ఆశా మీనన్ అధ్యక్షతన ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల కోసం సలహా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాన్స్‌జెండర్ సమాజ ప్రతినిధులు మరియు సంబంధిత భాగస్వాములతో ప్రాంతీయ సంప్రదింపుల సమావేశాలు నిర్వహించాలని ఈ కమిటీ నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, తెలంగాణ ప్రభుత్వ దివ్యాంగులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ సంయుక్త ఆధ్వర్యంలో 2026 నవంబర్ 16 మరియు 17 తేదీలలో హైదరాబాద్‌లోని బేగంపేట టూరిస్ట్ ప్లాజాలో ట్రాన్స్‌జెండర్ వ్యక్తులపై సలహా కమిటీ దక్షిణ ప్రాంతీయ సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహిస్తున్నాయి.
ట్రాన్స్‌జెండర్ సమాజంతో అర్థవంతమైన చర్చలు జరిపేందుకు ప్రతి రాష్ట్రం మరియు కేంద్రపాలిత ప్రాంతం నుంచి కనీసం 15 నుంచి 20 మంది ట్రాన్స్‌జెండర్ ప్రతినిధులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని కోరింది. వివిధ సామాజిక నేపథ్యాలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సంక్షేమం, రక్షణ, సమాన అవకాశాలు, విద్య, ఉపాధి, ఆరోగ్య సంరక్షణ, సామాజిక భద్రత మరియు సాధికారతకు సంబంధించిన సమస్యలు, అభిప్రాయాలు, సూచనలను సలహా కమిటీ సభ్యుల దృష్టికి తీసుకురావడానికి అవకాశం కల్పించబడింది.
ఈ సమావేశంలో మొదటి రోజు తెలంగాణ, కేరళ, కర్ణాటక మరియు గోవా రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ అధికారులు, ట్రాన్స్‌జెండర్ సమాజ ప్రతినిధులు పాల్గొన్నారు.
గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన సలహా కమిటీ అధ్యక్షురాలు, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి గౌరవ జస్టిస్ శ్రీమతి ఆశా మీనన్ అధ్యక్షతన, కమిటీ సభ్యుల సమక్షంలో ఈ సమావేశం జరిగింది.
భారత ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ నుంచి సెక్షన్ ఆఫీసర్ శ్రీమతి రష్మీ కార్తీక్, శ్రీమతి తాన్యా సేన్ గుప్తా మరియు శ్రీమతి శిఖా విశ్వకర్మ ఈ సమావేశానికి హాజరయ్యారు.
తెలంగాణ ప్రభుత్వ దివ్యాంగులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ డైరెక్టర్ శ్రీ వి. సర్వేశ్వర్ రెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వ మహిళా, శిశు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీమతి శ్రుతి ఓజా, ఐఏఎస్, సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సమావేశంలో తెలంగాణ రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ జెండగే హనుమంత్ కొండిబా, ఐఏఎస్, రాష్ట్ర ట్రాన్స్‌జెండర్ ప్రొటెక్షన్ సెల్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ శ్రీ ఎన్. సైదులు మరియు వైద్య విద్య సంచాలకులు డాక్టర్ ఎన్. వాణి పాల్గొన్నారు.
సమావేశంలో పాల్గొన్న రాష్ట్రాల ప్రతినిధులు తమ రాష్ట్రాల్లో ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సంక్షేమం మరియు సాధికారత కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, ఉత్తమ విధానాలను వివరించారు. అదేవిధంగా రాష్ట్ర ట్రాన్స్‌జెండర్ సంక్షేమ బోర్డులు, జిల్లా స్థాయి ట్రాన్స్‌జెండర్ రక్షణ విభాగాలు మరియు రాష్ట్ర స్థాయి రక్షణ విభాగాల పనితీరుపై చర్చించారు.ఈ సంప్రదింపుల సమావేశంలో ట్రాన్స్‌జెండర్ సమాజ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను, ప్రభుత్వ విధానపరమైన జోక్యం మరియు అదనపు సహాయం అవసరమైన అంశాలను సలహా కమిటీ దృష్టికి తీసుకువచ్చారు.
ప్రధానంగా ప్రస్తావించిన సమస్యలు:
1. సామాజిక వివక్ష మరియు కుటుంబ నిరాకరణ: సమాజంలో ఎదురవుతున్న వివక్ష, కుటుంబ సభ్యుల నుంచి ఆదరణ లేకపోవడం.
2. విద్యాపరమైన సమస్యలు: విద్యను అభ్యసించడంలో ఎదురవుతున్న ఇబ్బందులు, సమాన విద్యావకాశాల కొరత.
3. ఉపాధి అవకాశాల కొరత: ఉద్యోగాలు మరియు స్వయం ఉపాధి అవకాశాలు పరిమితంగా ఉండటం.
4. ఆరోగ్య సేవల కొరత: అవసరమైన వైద్య సేవలు, ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు తగినంతగా అందుబాటులో లేకపోవడం.
5. నివాసం మరియు ఆశ్రయ సదుపాయాలు: సురక్షిత నివాసం, ఆశ్రయ గృహాల అవసరం.
6. చట్టబద్ధమైన గుర్తింపు మరియు ధ్రువపత్రాలు: గుర్తింపు కార్డులు, ధ్రువపత్రాలు మరియు ఇతర అవసరమైన పత్రాల పొందడంలో ఎదురవుతున్న సమస్యలు.
7. భద్రత మరియు చట్టపరమైన రక్షణ: వ్యక్తిగత భద్రత, రక్షణ మరియు చట్టపరమైన సహాయం అవసరం.
8. సామాజిక భద్రత: ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు సామాజిక భద్రతా పథకాలు, సంక్షేమ ప్రయోజనాలు అందుబాటులో ఉండాల్సిన అవసరం.
సమావేశం ముగింపులో సలహా కమిటీ అధ్యక్షురాలు, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి గౌరవ జస్టిస్ శ్రీమతి ఆశా మీనన్ మాట్లాడుతూ, ఈ సంప్రదింపుల సమావేశంలో ట్రాన్స్‌జెండర్ సమాజ ప్రతినిధులు లేవనెత్తిన అన్ని సమస్యలను పరిగణనలోకి తీసుకొని, వాటి పరిష్కారానికి అవసరమైన సిఫార్సులను భారత ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖకు అందజేస్తామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *