Sun, 22 Nov 2026
🔴 BREAKING
ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రారంభోత్సవం రోజునే రూ.800 కోట్ల అమ్మకాలు సాధించిన ఏఎస్‌బీఎల్‌ లెగసీ నవనిర్మాణ్ ఫౌండేషన్ మరియు ట్రూ కనెక్ట్ ఈవెంట్స్ అండ్ ఎక్స్‌పోస్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్ సమీపంలోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న FAABXPO 2026 – ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ ఎక్స్‌పో GeM పోర్టల్ ద్వారా అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకున్న ట్రైబల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ( టిక్కి) నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఎపిక్ ఇంటర్నేషనల్ హాస్పిటల్‌ను ప్రారంభించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే విశిష్ట సామాజిక సేవకు గాను డాక్టర్ విజయరాజ్ గడ్డం గారికి ప్రతిష్టాత్మక “సేవా రత్న” పురస్కారం
Uncategorized

పవర్ గ్రిడ్ SR-I ఆధ్వర్యంలో శిల్పకళా వేదికలో ఘనంగా ప్రాంతీయ సాంస్కృతిక సమ్మేళనం, హస్తకళల ప్రదర్శన

హైదరాబాద్, నవంబర్ 3, 2026: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పవర్ గ్రిడ్), సదరన్ రీజియన్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్-I (SR-I) ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ప్రాంతీయ స్థాయి సాంస్కృతిక సమ్మేళనం (ఇంట్రా-రీజినల్ కల్చరల్ మీట్) మరియు హస్తకళల ప్రదర్శనను అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (SRTS-I) శ్రీ దోమన్ యాదవ్, దీప్ శిఖ మహిళా సమితి అధ్యక్షురాలు శ్రీమతి మీనా యాదవ్ హాజరయ్యారు. ఈ వేడుకలో చీఫ్ జనరల్ మేనేజర్ (అస్సెట్ మేనేజ్‌మెంట్) శ్రీ టీ.వి.ఎస్. ప్రవీణ్ కుమార్, చీఫ్ జనరల్ మేనేజర్ (ప్రాజెక్ట్స్) శ్రీ బి.బి. రథ్, చీఫ్ జనరల్ మేనేజర్ (ఇంజనీరింగ్) శ్రీ టి.ఎస్.సి. రావులతో పాటు వివిధ విభాగాల అధిపతులు, సంస్థ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులు విశేషంగా పాల్గొన్నారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని వివిధ పవర్ గ్రిడ్ కార్యాలయాల నుంచి వచ్చిన 20 బృందాలు ఈ సాంస్కృతిక పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటాయి.
సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు, పవర్ గ్రిడ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులు రూపొందించిన వైవిధ్యమైన కళారూపాలు, హస్తకళలు మరియు ఫైన్ ఆర్ట్స్ ప్రదర్శనను శ్రీమతి మీనా యాదవ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ దోమన్ యాదవ్ మాట్లాడుతూ.. సృజనాత్మకతను పెంపొందించడంలో, జట్టు భావనను (టీమ్ స్పిరిట్) పటిష్టం చేయడంలో సాంస్కృతిక కార్యక్రమాల పాత్ర కీలకమైనదని పేర్కొన్నారు.
“సాంకేతిక నైపుణ్యంతో పాటు, మన ప్రజల సృజనాత్మకత, ప్రతిభ, ఉత్సాహం మరియు జట్టు భావనే పవర్ గ్రిడ్ నిజమైన బలం,” అని శ్రీ డోమన్ యాదవ్ అన్నారు. “ఇలాంటి వేదికలు దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసి, ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా సహోద్యోగులు మరియు వారి కుటుంబాల మధ్య అనుబంధాన్ని మరింత బలపరుస్తాయి. సంస్కృతిని ప్రోత్సహించే పని వాతావరణం ఎల్లప్పుడూ అత్యుత్తమ పనితీరుకు ప్రేరణగా నిలుస్తుంది. పవర్ గ్రిడ్ దేశవ్యాప్తంగా విద్యుత్ రంగాన్ని అనుసంధానిస్తూ వెలుగులు నింపుతున్నట్లే, ఇలాంటి కార్యక్రమాలు మన అందరి శక్తిని, సృజనాత్మకతను ఒకతాటిపైకి తెచ్చి మన సంస్థను మరింత శక్తివంతంగా మారుస్తాయి.”
పోటీల్లో పాల్గొంటున్న 20 బృందాలకు శ్రీ డోమన్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రారంభం కావడానికి ముందు ముఖ్య అతిథులు న్యాయ నిర్ణేతల (జడ్జెస్) ప్యానెల్‌ను ఘనంగా సత్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *