Sun, 22 Nov 2026
🔴 BREAKING
ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రారంభోత్సవం రోజునే రూ.800 కోట్ల అమ్మకాలు సాధించిన ఏఎస్‌బీఎల్‌ లెగసీ నవనిర్మాణ్ ఫౌండేషన్ మరియు ట్రూ కనెక్ట్ ఈవెంట్స్ అండ్ ఎక్స్‌పోస్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్ సమీపంలోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న FAABXPO 2026 – ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ ఎక్స్‌పో GeM పోర్టల్ ద్వారా అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకున్న ట్రైబల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ( టిక్కి) నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఎపిక్ ఇంటర్నేషనల్ హాస్పిటల్‌ను ప్రారంభించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే విశిష్ట సామాజిక సేవకు గాను డాక్టర్ విజయరాజ్ గడ్డం గారికి ప్రతిష్టాత్మక “సేవా రత్న” పురస్కారం
Uncategorized

పీపుల్స్ ప్లాజాలో ఈజిప్టు అద్భుత ప్రపంచం.. ఘనంగా ప్రారంభమైన వింటర్ ఉత్సవ్ – 2026

ప్రారంభోత్సవానికి హాజరైన మాజీ మంత్రి దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్

సాగర తీరంలోని పీపుల్స్ ప్లాజా వేదికగా ఈజిప్టు ప్రాచీన చరిత్ర, సంస్కృతి, కళలను ప్రతిబింబించేలా రూపొందించిన వింటర్ ఉత్సవ్ మేళా – 2026 ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. నగరవాసులకు సరికొత్త వినోదాన్ని, మరచిపోలేని అనుభూతులను అందించేందుకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అభ్యర్థి పి. విజయారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మేళా నిర్వాహకుడు మిర్జా రఫీక్ బేగ్ మాట్లాడుతూ.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈజిప్టు నాగరికత, పిరమిడ్లు, ప్రాచీన కళలు, హైరోగ్లిఫిక్ చిత్రలిపి విశేషాలను ప్రతిబింబించేలా పీపుల్స్ ప్లాజాలో ప్రత్యేక ఈజిప్టు నగరాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఉత్తర ఆఫ్రికాలోని ప్రాచీన ఈజిప్టు అందాలను హైదరాబాద్‌లోనే వీక్షించే అవకాశాన్ని కల్పిస్తున్నామని పేర్కొన్నారు.గత మూడు నెలలుగా కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సుమారు 200 మంది కార్మికులు శ్రమించి ఈ ప్రత్యేక ఆకర్షణలను రూపొందించినట్లు వెల్లడించారు. ఈజిప్టు ప్రాచీన నగరాన్ని తలపించే నిర్మాణాలతో పాటు, కనుమరుగవుతున్న సాంప్రదాయ సర్కస్ విన్యాసాలను భారీ బాహుబలి స్టేజీపై ప్రదర్శించి సందర్శకులను అలరించనున్నట్లు తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో వింటర్ ఉత్సవ్ మేళా హైదరాబాద్ పర్యాటక రంగానికి మరింత ఆకర్షణగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మేళా సందర్శకులకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. నగరవాసులు కుటుంబ సమేతంగా విచ్చేసి ఈజిప్టు అద్భుత ప్రపంచాన్ని వీక్షించి, వినోదభరితమైన అనుభూతులను సొంతం చేసుకోవాలని మిర్జా రఫీక్ బేగ్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *