సుందరంగా తమ్మిడికుంట చెరువుకు
కొత్త జీవం!
శ్రీ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం
హైదరాబాద్ మాదాపూర్లోని తమ్మిడికుంట చెరువును ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గతంలో ఆక్రమణలు, వ్యర్థాలతో పూడుకుపోయిన ఈ చెరువును హైడ్రా ఆధ్వర్యంలో అద్భుతంగా పునరుద్ధరించారన్నారు.
గతంలో 12 ఎకరాలకే పరిమితమైన తమ్మిడికుంట చెరువు విస్తీర్ణాన్ని సుమారు 30 ఎకరాల వరకు విస్తరించి, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, వర్షపు నీరు నేరుగా చెరువులోకి చేరేలా ఏర్పాట్లు చేశారని, పరిసర ప్రాంతాల చిన్నారుల కోసం ఆటస్థలాలను కూడా అభివృద్ధి చేశారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, పలువురు మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సినీ నటుడు అక్కినేని నాగార్జున, కాస్మోస్ టెక్నోక్రాట్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
