దివ్యాంగుల రోస్టర్ ప్రకటించి మినహాయింపు పోస్టులను స్పష్టం చేయాలి.
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల లో సమావేశం ఏర్పాటు చేసి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 7437 పోలీసు శాఖ ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకాల్లో వికలాంగుల హక్కుల చట్టం–2016 ( ఆర్ పి డబ్ల్యు డి ఆక్ట్ 2016 ) ప్రకారం దివ్యాంగులకు కల్పించాల్సిన 4 శాతం రిజర్వేషన్ ప్రకారం 300 పోలీస్ శాఖ ఉద్యోగాలను రోస్టర్ ప్రకారం దివ్యాంగుల 4 శాతం రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలు చేయాలని విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం తెలంగాణ రాష్ట్ర కమిటీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.
పోలీసు నియామకాల్లో ఏయే పోస్టులు దివ్యాంగులకు అనుకూలమో శాస్త్రీయంగా పరిశీలించి, చట్టబద్ధంగా దివ్యాంగుల రోస్టర్‌ను ప్రకటించాలి. అలాగే దివ్యాంగులకు అనుకూలం కాని పోస్టులు ఉంటే, వాటిని చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా స్పష్టమైన మినహాయింపు (Exemption) ఉత్తర్వులతో ప్రకటించాలి. ఎలాంటి కారణాలు చూపకుండా దివ్యాంగులను పూర్తిగా నియామకాల నుండి దూరంగా ఉంచడం రాజ్యాంగ స్ఫూర్తికి, వికలాంగుల హక్కుల చట్టం–2016కు విరుద్ధం.
కాబట్టి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసు నియామక మండలి వెంటనే పోలీసు నియామక నోటిఫికేషన్‌ను పునఃసమీక్షించి, దివ్యాంగులకు 4% రిజర్వేషన్ అమలు చేస్తూ పోస్టుల వారీగా రోస్టర్‌ను ప్రకటించాలని, దివ్యాంగులకు అనువైన పోస్టులను గుర్తించి వారికి సమాన అవకాశాలు కల్పించాలని విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం తెలంగాణ రాష్ట్ర శాఖ విజ్ఞప్తి చేస్తోంది.
డిమాండ్లు:
వికలాంగుల హక్కుల చట్టం–2016 ప్రకారం 4% రిజర్వేషన్‌ను పూర్తిగా అమలు చేయాలి.
పోలీసు శాఖలో దివ్యాంగులకు అనువైన పోస్టుల రోస్టర్‌ను విడుదల చేయాలి. 7 437 పోస్టులలో దివ్యాంగులకు 300 పోస్టులు నింపి రాజనీతి నిరూపించుకోవాలి
లేని పక్షంలో రాజ్యాంగ ప్రకారం ముందుకు సాగి దివ్యాంగులకు రిజర్వేషన్ సాధిస్తామని విశ్వ విద్యాలయాల దివ్యాంగుల ఫోరం తెలిపింది.
దివ్యాంగుల హక్కులను పరిరక్షిస్తూ సమాన ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు సాధన సమితి చైర్మన్ చెరుకు నాగభూషణం
విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎన్ అశోక్, విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మారవేణి చంద్రశేఖర్ యాదవ్, జనరల్ సెక్రెటరీ ఆంజనేయులు గౌడ్, మొరిగాడి నరసింహ గౌడ్,
మొక్క ఉపేందర్, ధనమ్మ జనమ్మ, కర్ణాకర్ వెంకటేష్ జగన్, వెంకట్ దివ్యంగా విద్యార్థులు నాయకులు పాల్గొన్నారు
