కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో చేపట్టిన ‘సంఘటన్ శ్రీజన్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా నేడు ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్, గాదిగూడ మండలాల్లో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్, ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, మాజీ ఎంపీ సోయం బాపూరావు గార్లతో కలిసి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ. నూతన మండల కమిటీల ఏర్పాటులో ఎలాంటి వర్గ విభేదాలకు తావులేకుండా, అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం, పారదర్శకత ప్రాతిపదికగా కమిటీలను రూపొందించాలని సూచించారు. మండల మరియు పీఏసీ (PAC) కమిటీలను ఈ నెల 7వ తేదీ వరకు, అలాగే మిగతా కమిటీల నియామక ప్రక్రియను 15వ తేదీ వరకు వేగవంతంగా పూర్తి చేయాలని నాయకులు, కార్యకర్తలకు స్పష్టం చేశారు. నూతనంగా ఏర్పాటయ్యే ప్రతి మండల కమిటీలో అధ్యక్షుడితో సహా మొత్తం 22 మంది సభ్యులు ఉంటారని వెల్లడించారు. వీటిలో ఇద్దరు ఉపాధ్యక్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శులు మరియు ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. విశేషంగా పార్టీ కమిటీల్లో మహిళా నాయకులకు, కార్యకర్తలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని ఆదేశించారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి ఐక్యత, క్రమశిక్షణ, సమిష్టి కృషి తప్పనిసరి అని నాయకులు పునరుద్ఘాటించారూ
ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజీద్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవ్ రెడ్డి, PAC మెంబర్ ఏలేటి అశ్విన్ రెడ్డి, డిసిసి కార్యవర్గ సభ్యులు ,మాజీ టీటీడీ బోర్డ్ మెంబెర్ అనిల్ ,సిరికొండ మండల అధ్యక్షులు కంచం లక్ష్మణ్, గాదిగూడ మండల అధ్యక్షులు సీడం వామన్, స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మండల కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
