- ప్రతిభ కనబరిచిన మైనార్టీ విద్యార్థులను సీఎం శ్రీ రేవంత్ రెడ్డి అభినందించి ప్రోత్సహించారు.
- ప్రతిభావంతులైన విద్యార్థులకు ల్యాప్టాప్లను అందజేయడంతో పాటు, ఉన్నత ప్రతిభ చూపించిన విద్యార్థులకు షీల్డ్లు, బహుమతులను అందజేశారు.
మైనార్టీ విద్యార్థులు విద్యారంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం పేర్కొన్నారు.విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు పాల్గొని విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.
