Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

దివ్యాంగుల హక్కుల చట్టం2016. పోలీస్ శాఖలో అమలు చేయాలని డిజిపి నీ కోరిన విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం రాష్ట్ర కమిటీ

దివ్యాంగుల చట్టం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయిన ఇంతవరకు దివ్యాంగుల కోసం ఏర్పడిన చట్టం చట్ట రూపంలో దాల్చకపోవడంతో చట్టం అమలుకై హైదరాబాదులో డిజిపి కార్యాలయంలో డీజీపీని కలిసి దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై. దివ్యాంగుల్లో కూడా డ్రెస్ కోడ్ ఉద్యోగాల అమలుకై డిజిపి తో సమావేశం అయిన దివ్యాంగుల ఫోరం 2016 చట్టం పుస్తకం ఇచ్చి పోలీస్ శాఖలో అవగాహన సదస్సులు ప్రతి జిల్లా కేంద్రంలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాలని. ప్రతి పోలీస్ కార్యాలయంలో దివ్యాంగుల హక్కుల చట్టం బోర్డులు ఏర్పాటు చేయాలని పోలీస్ స్టేషన్లో ర్యాంపులు కూడా ఏర్పాటు చేయాలని డిజిపి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది చట్టంపై పుస్తకంలో పొందుపరిచిన విషయాలను డీసీపీ గారికి వివరించడం జరిగింది ప్రతి జిల్లాలో సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ దివ్యాంగ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉంటారని అధ్యక్షుడిగా కలెక్టర్ ఉంటారని సభ్యులుగా వివిధ శాఖల నుంచి ఉంటారని కమిటీలో కొంతమంది దివ్యాంగులు కూడా పనిచేస్తారని డిజిపి కి వివరించడం జరిగింది. రాష్ట్రంలో డిజిపిగా మాకు మీరు ఉపాధ్యక్షుడిగా మంత్రి అధ్యక్షునిగా ఉంటారని. అందువలన దివ్యాంగులకు ప్రత్యేక సమయం ఇచ్చి వారితో నెలకు ఒకసారి సమావేశం కావాలని కోరడం జరిగింది డిజిపి సానుకూలంగా స్పందిస్తూ దివ్యాంగుల హక్కులను చట్టాన్ని పోలీస్ శాఖల దివ్యాంగుల హక్కుల చట్టం 2016 ను అమలు చేస్తామని హామీ ఇచ్చారని దివ్యాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎన్ అశోక్ వివరించారు చట్టంలో పొందుపరిచిన నాలుగు శాతం రిజర్వేషన్ దివ్యాంగులకు కేటాయించాలని చట్టబద్ధమైన ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, దివ్యాంగులపై వివక్ష, అవమానం, వేధింపులు, హింసను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతూ విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర డీజీపీకి వినతిపత్రం సమర్పించింది.
దివ్యాంగుల హక్కుల చట్టం–2016 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో బెంచ్‌మార్క్ దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ఫోరం డిమాండ్ చేసింది. పోలీస్ శాఖలో దివ్యాంగులకు అనుకూలమైన పరిపాలనా, సాంకేతిక, కార్యాలయ పోస్టులను గుర్తించి, ఇప్పటికే ఉన్న బ్యాక్‌లాగ్ ఖాళీలను ప్రత్యేక నియామక ప్రక్రియ ద్వారా భర్తీ చేయాలని కోరింది.

అలాగే రాష్ట్రంలోని ప్రతి పోలీస్ స్టేషన్‌లో దివ్యాంగుల హక్కుల చట్టం–2016లోని సెక్షన్లు 89, 91, 92పై అవగాహన బోర్డులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. దివ్యాంగులపై జరిగే దౌర్జన్యాలు, అవమానాలు, దాడులు, వేధింపులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
దివ్యాంగులు పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేసేందుకు వచ్చినప్పుడు వారి వైకల్యానికి అనుగుణంగా సహాయం అందించేలా పోలీస్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఫోరం సూచించింది. అవసరమైన చోట సైన్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రెటర్, సహాయక వ్యక్తి, అందుబాటులో ఉండే ఫిర్యాదు విధానం వంటి సౌకర్యాలు కల్పించాలని కోరింది.
రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ అధికారులు, సిబ్బందికి “దివ్యాంగుల హక్కులు–పోలీసుల బాధ్యతలు” అనే అంశంపై ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలని, దివ్యాంగులకు రక్షణ, గౌరవం, సమానత్వం, ఉపాధి అవకాశాలు కల్పించడంలో తెలంగాణ పోలీస్ శాఖ దేశానికి ఆదర్శంగా నిలవాలి” అని ఫోరం రాష్ట్ర కమిటీ డీజీపీని కోరింది. ఇట్టి కార్యక్రమంలో
విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎన్ అశోక్ విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మారవేణి చంద్రశేఖర్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల ఫోరం ఉపాధ్యక్షులు కుర్షిద్ మియా మహిళా అధ్యక్షురాలు ధనమ్మ .రాష్ట్ర సహాయ కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి ఫోరం సభ్యుడు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *