Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

శ్రీ ఎస్. రామ్ గోపాల్ రెడ్డి గారి 35 ఏళ్ల సేవా ప్రస్థానానికి ఘన వీడ్కోలు

హైదరాబాద్, సెప్టెంబర్ 01, 2026: మింట్ కాంపౌండ్ కార్పొరేట్ క కార్యాలయం

టీజీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఇన్‌చార్జ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ (సివిల్)గా విధులు నిర్వహించిన శ్రీ ఎస్. రామ్ గోపాల్ రెడ్డి గారు 35 సంవత్సరాల సుదీర్ఘ, విశిష్ట సేవలను విజయవంతంగా పూర్తి చేసి, 31-08-2026న వయోపరిమితి పూర్తి చేసుకొని పదవీ విరమణ పొందారు.

ఈ సందర్భంగా మాస్టర్ ప్లాన్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు మరియు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఐటీ మరియు ప్రాజెక్ట్స్ డైరెక్టర్ శ్రీ వి శివాజీ గారు  ముఖ్య అతిథిగా హాజరై శ్రీ రామ్ గోపాల్ రెడ్డి గారి సేవలను కొనియాడారు.

విద్యుత్ సంస్థ అభివృద్ధికి ఆయన అందించిన సేవలు, సివిల్ విభాగంలో చేపట్టిన నిర్మాణాత్మక కార్యక్రమాలు, అంకితభావంతో కూడిన విధి నిర్వహణ సంస్థకు చిరస్మరణీయమని ఆమె పేర్కొన్నారు. ఉద్యోగ జీవితంలో ఆయన ప్రదర్శించిన క్రమశిక్షణ, నిబద్ధత, నాయకత్వ లక్షణాలు యువ ఉద్యోగులకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఐటీ , ఆపరేషన్, ప్రాజెక్ట్స్, పి అండ్ ఎం ఎం, హెచ్ ఆర్ సి ఈ , మేడ్చల్ సీఈ పాల్గొన్నారు తదితర అధికారులు, మాస్టర్ ప్లాన్ విభాగ ఉద్యోగులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అధికారులు, ఉద్యోగులు శ్రీ రామ్ గోపాల్ రెడ్డి గారిని శాలువాతో సన్మానించి, జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పదవీ విరమణ అనంతరం ఆయన ఆరోగ్యంగా, ఆనందంగా, కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవితం గడపాలని ఆకాంక్షించారు.

“35 ఏళ్ల సేవా ప్రస్థానం – అంకితభావానికి నిదర్శనం, నాయకత్వానికి చిరునామా, సంస్థకు విలువైన వారసత్వం” అంటూ సహోద్యోగులు ఆయన సేవలను స్మరించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *