Wed, 09 Sep 2026
🔴 BREAKING
క్యూసీఎఫ్ఐ హైదరాబాద్ చాప్టర్ 40వ వార్షిక సదస్సు మహాధర్నా – “బియ్యం మిల్లుల యజమానుల భద్రత – రైతుల భవిష్యత్తు – కార్మికుల జీవనోపాధి” బియ్యం మిల్లుల యజమానుల సంక్షేమ సంఘం – తెలంగాణ రాష్ట్రం బంగారు మైసమ్మ తల్లి బోనాల జాతర ఘనంగా నిర్వహణ భారతదేశపు అతిపెద్ద శిల్ప భాండాగారం, సిలాయీ, ఇప్పుడు హైదరాబాద్‌లో!! 2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సహజ రత్నాల ఆభరణాలకు సరికొత్త రూపాన్ని అందిస్తూ ‘నైరా’ కలెక్షన్ ను విడుదల చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్
Uncategorized

ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్ అయిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (C.P.S.) ను తక్షణమే రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (O.P.S.) పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ. తెలంగాణ ఉద్యోగుల, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల, కార్మికులు మరియు పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ (JAC), హైదరాబాద్ జిల్లా ఆధ్వర్యంలో నేడు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయ ప్రాంగణంలో భారీ లంచ్ అవర్ నిరసన కార్యక్రమం

తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ, హైదరాబాద్ జిల్లా చైర్మన్ శ్రీ ఎస్. విక్రమ్ కుమార్ మరియు కన్వీనర్ శ్రీ ఎం.బి. కృష్ణ యాదవ్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో వివిధ శాఖల నుండి అన్ని కేడర్లకు చెందిన వేలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ శ్రీ ఏలూరి శ్రీనివాస రావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ డాక్టర్ ఎస్.ఎం. (హుస్సేని) ముజీబ్, డిప్యూటీ సెక్రటరీ జనరల్ శ్రీ బి. శ్యామ్ ముఖ్య అతితులుగా విచ్చేసి ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు.

అలాగే ఈ నిరసన సభలో టీఎన్‌జీఓస్ కేంద్ర సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీ ఎం. సత్యనారాయణ గౌడ్, కోశాధికారి శ్రీమతి ఉమ, కార్యదర్శి శ్రీమతి శైలజ, ఉపాధ్యక్షులు శ్రీ నజీర్, టీఎన్‌జీఓస్ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి శ్రీ కురాడి శ్రీనివాస్ మరియు నాయకులు జేఏసీ నాయకుడు నర్సింగ్ రావు నాయకుడు సత్యనారాయణ శోకత్ సుజాత ఏమీ ఖాదర్. డాక్టర్ సురేందర్.రాజేందర్ డాక్టర్ రవికుమార్ అహ్మద్ గౌస్ ప్రవీణ్ కుమార్ శ్రీ రాంబాబు, శ్రీ రామ సుబ్బారావు, శ్రీ వినోద్, శ్రీ శ్యామ్ సుందర్, శ్రీ ఇఫ్తేకర్, శ్రీమతి చంద్ర జ్యోతి, శ్రీ ఆశన్న తదితరులు పాల్గొని ఉద్యమానికి సంఘీభావం తెలిపారు.

ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసానిచ్చే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే వరకు ప్రభుత్వాలపై పోరాటం ఆపేది లేదని నాయకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం అందరూ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *