రైతులు ఆరుదల పంటలు సాగు చేసుకోవాలని ఏడిఏ తాతారావు అన్నారు.

గురువారం మొరంపల్లి బంజర్ రైతు వేదికలో రైతులకు కంది విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్, జూలై ముగింపు వస్తున్నప్పటికీ తక్కువ వర్షపాతం నమోదు అయిందని తెలిపారు. అందువలన రైతులు వరి సాగును తగ్గించి కంది పెసర మినుము తదితర ఆరుదాల పంటలను సాగు చేసుకోవాలని తెలిపారు. అంతేకాకుండా వరి పంట వేస్తున్న రైతులు నీటిని వృధా కాకుండా చూసుకోవాలన్నారు. వరి పొలానికి కావాల్సినంత నీటిని పెట్టుకొని మోటార్లను నిలిపివేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ రైతు గాదె నర్సిరెడ్డి, ఏఈవో నాగ వైష్ణవి, సింగం వెంకటేశ్వర్ రెడ్డి కామిరెడ్డి పద్మ,పండగ రాములు రైతులు తదితరులు పాల్గొన్నారు.
