సమాజంలో ప్రతి ఒక్కరూ దివ్యాంగులను సానుభూతితో కాకుండా సమానత్వ దృక్పథంతో చూడాలి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే.
దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపే దిశగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్‌గూడ మహమూద్ ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో, నేడు హ్యుందాయ్ మొబిస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన (యాక్సెసిబిలిటీ అండ్ ఫ్రీడమ్) కార్యక్రమంలో భాగంగా
తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, దివ్యాంగులు, వృద్ధులు & ట్రాన్స్జెండర్ల సాధికారత శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు ప్రత్యేక అతిథిగా పాల్గొని, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 90 మంది దివ్యాంగులకు నియో ఫ్లై బోల్ట్ పవర్ వీల్చైర్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,
దివ్యాంగుల సంక్షేమం, సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది అన్నారు..ప్రభుత్వంతో పాటు కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతలో భాగంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు..
ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్ చిన్న శ్రీశైలం యాదవ్ గారు.. జాతీయ దివ్యాంగుల హక్కుల సంఘం అధ్యక్షులు తుడుం రాజేందర్ గారు, దివ్యాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు షఫీ అహ్మద్ ఖాన్ గారు..ప్రభాంజాన గారు,CSR జయశ్రీ గారు,మరియు దివ్యాంగులు.. తదితరులు పాల్గొన్నారు.
