ఎల్బీ స్టేడియంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
ప్రకటన న్యూస్, హైద్రాబాద్, 14 జూలై, 2026: ప్రకటన న్యూస్ ప్రతినిధి: బి. అనిత
హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం ప్రాంగణంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆలయాన్ని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.

అనంతరం ఆలయ అర్చకుల ఆశీర్వాదాలు స్వీకరించిన మహేష్ కుమార్ గౌడ్ గారు, భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక సంప్రదాయాలు సమాజంలో శాంతి, సామరస్యాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రజలందరికీ శ్రీ కనకదుర్గ అమ్మవారి కరుణాకటాక్షాలు లభించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మామిడి గోపి, కమిటీ సభ్యులు, భక్తులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

