తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రత్యేక రాష్ట్ర స్వాప్నికుడు, ఆచార్య జయశంకర్ 92 వ జయంతి వేడుకలు భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈనెల 6 న ఉదయం 11 గంటలకు రవీంద్ర భారతిలోని ప్రధాన ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు భాషా సాంస్కృతిక శాఖ ఇంచార్జ్ అసిస్టెంట్ డైరెక్టర్ పీ. నర్సింలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేడుకులకు ముఖ్య అతిథులుగా భాషా సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ , స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ వాణిప్రసాద్ హాజరుకానున్నట్లు తెలిపారు. సభలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే జయశంకర్ స్ఫూర్తిగానం ఉంటుంది. జయశంకర్ అభిమానులు అధిక సంఖ్యలో హాజరుకావాలని నరసింహులు గారు కోరారు
