సరిహద్దుల్లో సైనికులు.. ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది ప్రజల ప్రాణాలకు రక్షణ – డాక్టర్ పవన్ కుమార్
హైదరాబాద్, ఆగస్టు 15: కేర్, ఆస్టర్ హాస్పిటల్స్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. వైద్యులు, నర్సులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.
బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్‌లో ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ లిమిటెడ్ సీఈఓ–ఇండియా II డాక్టర్ పవన్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జోనల్ సీఓఓ అభినవ్ జోషి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అజిత్ సింగ్, సీనియర్ వైద్యులు డాక్టర్ పి.సి. గుప్తా, డాక్టర్ వి. సూర్య ప్రకాష్‌తో పాటు నర్సింగ్, సెక్యూరిటీ విభాగాల సిబ్బంది, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ.. “స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగాలను స్మరించుకోవడంతో పాటు దేశ భవిష్యత్తు పట్ల మన బాధ్యతను గుర్తుచేసుకునే రోజు ఇది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి భారత్ అన్ని రంగాల్లో అద్భుతమైన అభివృద్ధి, పరివర్తన సాధించింది. వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనకు బాధ్యతగల పౌరులుగా స్పష్టమైన దృక్పథంతో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలి. సరిహద్దుల్లో సైనికులు దేశాన్ని కాపాడుతుంటే.. వైద్యులు, వైద్య సిబ్బంది ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడుతున్నారు. ఇద్దరూ అంకితభావంతో దేశానికి సేవ చేస్తున్నారు” అని పేర్కొన్నారు.
దేశాభివృద్ధిలో ప్రజారోగ్యం కీలకమని తెలిపారు. ఆరోగ్యవంతమైన ప్రజలతోనే బలమైన సమాజం, అభివృద్ధి చెందిన దేశం సాధ్యమని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడుతూ ఆరోగ్యవంతమైన భారత నిర్మాణంలో వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని వివరించారు.
వేడుకల్లో భాగంగా జాతీయ పతాకావిష్కరణ, జాతీయ గీతాలాపనతో పాటు దేశభక్తి కార్యక్రమాలు నిర్వహించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పించారు.
ఓవైపు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతుండగా.. మరోవైపు ఆసుపత్రుల్లో అత్యవసర, క్రిటికల్ కేర్ సహా కీలక వైద్య సేవలు యథావిధిగా కొనసాగాయి.
నాణ్యమైన వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తూ ఆరోగ్యవంతమైన, బలమైన భారత్ నిర్మాణానికి కృషి చేస్తామని కేర్, ఆస్టర్ ఆసుపత్రుల ప్రతినిధులు తెలిపారు.
Photo Caption: కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్‌లో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో డాక్టర్ పవన్ కుమార్, సీఈఓ – ఇండియా II, ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ లిమిటెడ్; డాక్టర్ అభినవ్ జోషి, జోనల్ సీఓఓ; డాక్టర్ అజిత్ సింగ్, మెడికల్ సూపరింటెండెంట్; సీనియర్ వైద్యులు డాక్టర్ పి.సి. గుప్తా, డాక్టర్ వి. సూర్య ప్రకాష్, డాక్టర్ శరత్, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ శాంతి నాయుడు, డాక్టర్ ఝాన్సీతో పాటు నర్సింగ్, సెక్యూరిటీ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
